Kuldeep Yadav Gets Chance in Team India: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఇటీవల భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాణించిన ఈ చైనామన్.. ఒకేసారి మూడు జట్లలో స్థానం సాధించడం విశేషం. ఇన్నాళ్లు ఈ స్పిన్నర్‌ను పక్కన పెట్టిన సెలెక్టర్లు.. ఇప్పుడు టీ20, వన్డే, టెస్టు జట్టులో స్థానం కల్పించడం విశేషం. దీంతో ఒక్కసారిగా ఈ వెటరన్ ప్లేయర్ ఫీట్ మారిపోయింది. టీ20 వరల్డ్ కప్ తరువాత న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు జట్టులో కుల్దీప్ స్థానం సంపాదించాడు.
న్యూజిలాండ్ పర్యటనలో వన్డే, T20 సిరీస్‌లు ఆడనున్నాడు కుల్దీప్ యాదవ్. అదేవిధంగా ఆ తరువాత బంగ్లాదేశ్ పర్యటనలో టెస్ట్ జట్టులో కూడా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌లో భారత్ ఈ నెల 18 నుంచి 30 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తరువాత డిసెంబర్ 4 నుంచి 26 వరకు బంగ్లాదేశ్‌లో మూడు వన్డేల సిరీస్‌తో పాటు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా ఆడనుంది.
కొంతకాలం క్రితం వరకు యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కారణంగా సెలెక్టర్లు కుల్దీప్ యాదవ్‌ను పట్టించుకోలేదు. దీంతో ఈ చైనామన్‌కు ఇప్పట్లో జట్టులో చోటు కష్టమేనని అందరూ భావించారు. కానీ సఫారీ జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించి తన సత్తా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఫ్లాప్ అవ్వడంతో.. కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించారు సెలెక్టర్లు. ఏకంగా మూడు జట్లలోనూ చైనామాన్ బౌలర్‌ను ఎంపిక చేశారు. అయితే బంగ్లాతో జరిగే వన్డే సిరీస్‌కు కుల్దీప్‌కు చోటు కల్పించలేదు.
న్యూజిలాండ్ టూర్:
టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
వన్డే జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభమాన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చహర్, కుల్‌దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), KS భరత్ (WK), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (WK), ఇషాన్ కిషన్ (WK), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యశ్ దయాల్.
- భారత్ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్ (షెడ్యూల్)
1వ T20, నవంబర్ 18, 12.00 PM, వెల్లింగ్టన్
2వ T20, నవంబర్ 20, మధ్యాహ్నం 12.00, మౌంట్ మౌంగనుయి
3వ T20, నవంబర్ 22 మధ్యాహ్నం 12.00 గంటలకు, నేపియర్
- భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్
1వ ODI, నవంబర్ 25, ఉదయం 7.00, ఆక్లాండ్
2వ ODI, నవంబర్ 27, ఉదయం 7.00, హామిల్టన్
3వ ODI, నవంబర్ 30, ఉదయం 7.00, క్రైస్ట్‌చర్చ్
- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వన్డే సిరీస్
1వ వన్డే, డిసెంబర్ 4, మధ్యాహ్నం 12.30, ఢాకా
2వ వన్డే, డిసెంబర్ 7 మధ్యాహ్నం 12.30 గంటలకు, ఢాకా
3వ వన్డే, డిసెంబర్ 10, మధ్యాహ్నం 12.30, ఢాకా
- భారత్ vs బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్
1వ టెస్ట్ మ్యాచ్, డిసెంబర్ 14-18, ఉదయం 9.30, చిట్టగాంగ్
2వ టెస్ట్ మ్యాచ్, డిసెంబర్ 22-26, ఉదయం 9.30, ఢాకా
Also Read: Huzurnagar Death Case: కన్నకొడుకును హత్య చేయించిన తల్లిదండ్రులు.. చిన్న తప్పుతో దొరికిపోయారు
Also Read: Minister KTR: సీఎం జగన్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook