Deepak Chahar: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు దీపక్ చాహర్ రెడీ

Chennai Super Kings IPL 2023: స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఫిట్‌నెస్ సాధించాడు. గాయాల నుంచి కోలుకుని ఎట్టకేలకు ఐపీఎల్‌కు రెడీగా ఉన్నట్లు ప్రకటించాడు. గత సీజన్‌కు గాయం కారణంగా చాహర్ లేకపోవడం చెన్నై జట్టుపై ప్రభావం చూపించింది. ఈ సీజన్‌కు అందుబాటులోకి రావడంతో సీఎస్‌కే అభిమానులు సంబరపడిపోతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2023, 11:10 AM IST
  • ఫిట్‌నెస్ సాధించిన దీపక్ చాహర్
  • ఐపీఎల్‌కు రెడీగా ఉన్నట్లు ప్రకటన
  • సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ
Deepak Chahar: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు దీపక్ చాహర్ రెడీ

Chennai Super Kings IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్‌న్యూస్ వచ్చింది. స్టార్ పేసర్ దీపక్ చాహర్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించాడు. గత ఆరు నెలలుగా దీపక్ చాహర్ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. గాయాల నుంచి కోలుకుని పూర్తిగా ఫిట్‌గా ఉండడంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపాడు. గతేడాదిలో రెండు పెద్ద గాయాలతో పోరాడిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఎట్టకేలకు ఐపీఎల్‌కు అందుబాటులోకి రావడంతో సీఎస్‌కే ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్‌కు దీపక్ చాహర్ దూరమవ్వడం చెన్నై జట్టు విజయాలపై ప్రభావం చూపించింది. 

గతేడాది బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో దీపక్ తన చివరి ఇంటర్నెషనల్ మ్యాచ్ ఆడాడు. రెండో వన్డేలో కేవలం 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. గాయం తిరగబెట్టడంతో మ్యాచ్ మధ్యలో నుంచే తప్పుకున్నాడు. 2022లో చాహర్ టీమిండియా తరపున కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్‌కు కూడా దూరమయ్యాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ట్రీట్‌మెంట్ పొందిన తరువాత.. చాహర్ ఐపీఎల్‌ కోసం సిద్ధమవుతున్నాడు. గత రెండు మూడు నెలలుగా ఫిట్‌నెస్‌ సాధించడం కోసం చాలా కష్టపడ్డాడు. 

'గత 2 నుంచి 3 నెలల్లో నేను నా ఫిట్‌నెస్‌పై కోసం చాలా శ్రమించాను. ఇప్పుడు నేను ఐపీఎల్‌లో ఆడేందుకు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాను. నాకు రెండు గాయాలు అయ్యాయి. ఈ రెండు గాయాల కారణంగా చాలా నెలలుగా క్రికెట్‌కు దూరమయ్యాను. గాయాల నుంచి కోలుకోవడానికి ఏ ఆటగాడికైనా సమయం పడుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్‌కు ఇంకా ఎక్కువ. నేను బ్యాట్స్‌మెన్‌గా ఉంటే.. చాలా ముందుగానే ఆడటం ప్రారంభించేవాడిని. కానీ ఫాస్ట్ బౌలర్ కావడంతో అంత తేలికైన పని కాదు. ఇతర బౌలర్లు వెన్ను లేదా గజ్జ గాయాలతో ఇబ్బంది పడుతున్న వారిని కూడా మీరు చూడవచ్చు..' అని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు.

30 ఏళ్ల ఈ రాజస్థాన్ పేసర్ గత నెలలో సర్వీసెస్‌తో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌తో గ్రౌండ్‌లోకి మళ్లీ దిగాడు. ఈ ఏడాది చివర్లో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియా జట్టుకు దీపక్ చాహర్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఐపీఎల్‌లో దీపక్ చాహర్ బౌలింగ్‌తోపాటు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లోనూ చెన్నై జట్టుకు కీలకంగా మారనున్నాడు. 

Also Read: Chennai Super Kings: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే.. ఆ ప్లేయర్ ఎంట్రీతో మరింత పవర్‌ఫుల్   

Also Read: PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్యగమనిక.. మీ ఖాతాలో నగదు ఎప్పుడు జమకానుందంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News