Central Government New Schemes 2024: భారతదేశ రైతులకు RBI అదిరిపోయే న్యూస్.. ఏకంగా ఖాతాలోకి రూ.2 లక్షలు.. ఇక పండగే!

Central Government New Schemes 2024: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న సన్నకార రైతులకు పెద్ద శుభవార్త అందించింది. ఎలాంటి అష్యూరెన్స్ లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలకమైన నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఈ రుణాన్ని రూ.2 లక్షలకు పెంచుతూ సర్క్యులర్ను త్వరలోనే జారీ చేయబోతోంది. దీనివల్ల నేరుగా ఈ పథకాన్ని అప్లై చేసుకునే రైతులకు ఖాతాలోకి రుణం 2 లక్షల వరకు జమవుతుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 8, 2024, 10:56 AM IST
Central Government New Schemes 2024: భారతదేశ రైతులకు RBI అదిరిపోయే న్యూస్.. ఏకంగా ఖాతాలోకి రూ.2 లక్షలు.. ఇక పండగే!

Central Government New Schemes 2024: దేశంలోని సన్న కారు రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకాలను ప్రవేశ పెడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చిన్న సన్నకారు రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. తనఖా రహిత వ్యవసాయ రుణాల పేరుతో అన్నదాతలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఈ కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇటీవల జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరిమితి విధాన సమీక్షలో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ స్కీం లో భాగంగా రైతుల ఎలాంటి అసూరెన్స్ లేకుండానే దాదాపు రూ.1.6 లక్షలకు పైగా రుణం తీసుకునే ప్రత్యేకమైన సౌలభ్యాన్ని అందిస్తోంది. అయితే గతంలో కేవలం లక్షకు మాత్రమే ఉన్న పరిమితిని ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు లక్షలకు పెంచినట్లు ప్రకటించింది.

పంట పెట్టుబడికి ఖర్చులు పెరగడంతో.. అలాగే ఒకపక్క ద్రవ్యోల్బణం పెరగడం కారణంగా, ఇతర ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ వస్తుండడంతో ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ రుణ పరిమితిని రెండు లక్షలకు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సర్క్యులర్ రూపంలో జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 2019 సంవత్సరానికి ముందు ఈ రుణ పరిమితి కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఉండేది. అయితే రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని అదనంగా రూ.60 వేలు పెంచినట్లు తెలిసింది. అయితే మళ్లీ 5 సంవత్సరాల తర్వాత రైతుల బాధలను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణపరిమితిని పెంచుతూ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.

"రైతులకు సంబంధించిన తనఖా రహిత వ్యవసాయ పెట్టుబడి రుణాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సవరించిన సంగతి తెలిసిందే. వ్యవసాయంలో వస్తున్న మార్పుల కారణంగా పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని కొలాటరల్ ఫ్రీ అగ్రికల్చర లోన్స్ ను ఏకంగా రూ.2 లక్షలు చేసాం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు ఎప్పుడు అవసరమైన పెట్టుబడిన అందించేందుకు ముందుంటుందని.. ఈ రుణ సదుపాయాన్ని కూడా ప్రతి చిన్న సన్న కారు రైతు సద్వినియోగం చేసుకోవాలి" అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస్ తెలిపారు.

బ్యాంకులకు అదిరిపోయే గుడ్ న్యూస్: 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల నగదుకు సంబంధించిన అంశంపై కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో క్యాష్ రిజర్వ్ రేషన్ పేరుతో నగదు నిల్వల నిష్పత్తిని కోత పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దీని శాతం 4.5 ఉండగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల బ్యాంకులు ఎవరికైనా సులభంగా రుణాలు ఇచ్చేందుకు ఎంతో వీలుంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ప్రకటనతో రూ.1 లక్షల కోట్లకు పైగా నిధులు బ్యాంకింగ్ సెక్టార్ లో జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీనివల్ల బ్యాంకుల వద్ద నిధులు ఎక్కువ మోతాదులో నిల్వగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని ఆర్బిఐ పేర్కొంది.

Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News