ఆ క్లాస్ ఇండియన్ బ్యాట్స్ మెన్ ను ఆకాశానికెత్తేసిన బ్రియాన్ లారా..

భారత క్రికెట్ జట్టుపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా. వర్తమాన క్రికెటర్లలో టీమిండియా ప్రస్తుతం తన ఫేవరేట్ ప్లేయర్ పేరును వెల్లడించి తన మనసులోని మాటను చెప్పేశాడు. కాగా తనకు భారత జట్టు ఓపెనర్ 

Last Updated : Mar 10, 2020, 10:36 PM IST
 ఆ క్లాస్ ఇండియన్ బ్యాట్స్ మెన్ ను ఆకాశానికెత్తేసిన బ్రియాన్ లారా..

న్యూ ఢిల్లీ: భారత క్రికెట్ జట్టుపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా. వర్తమాన క్రికెటర్లలో టీమిండియా ప్రస్తుతం తన ఫేవరేట్ ప్లేయర్ పేరును వెల్లడించి తన మనసులోని మాటను చెప్పేశాడు. కాగా తనకు భారత జట్టు ఓపెనర్ లోకేష్ రాహుల్ ఆట తనకు ఎంతగానో నచ్చుతుందని, అతి తక్కువ కాలంలో ఎంతో పరిణతి చెందిన ఆటగాడిగా ఎదిగాడని అన్నారు. కేఎల్ రాహుల్ ఆటతీరును చూసి అభిమానిగా మారిపోయానని, రాహుల్ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తానని విండీస్ దిగ్గజ బ్యాట్స్ మెన్ లారా పేర్కొన్నారు. 

 వర్తమాన క్రికెటర్లో కొత్తరకమైన క్లాస్ షాట్స్, బాటింగ్ విన్యాసాన్ని అందించడంలో రాహుల్ తనకు తానే సాటి అని ఆకాశానికి ఎత్తేశారు.  లోకేష్ రాహుల్ బాటింగ్ శైలి చూస్తుంటే అలాగే టీవీ దగ్గర అతుక్కుపోతుంటానని, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటుందని  క్రీడా మ్యాగజైన్ స్పోర్ట్స్ స్టార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రియాన్ లారా ఈ వ్యాఖ్యలు చేశాడు. 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News