/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Sourav Ganguly resigns as BCCI President: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్  సౌరవ్‌ గంగూలీ సంచలన నిర్ణయం తీసుకున్నారట. బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ అయిన గంగూలీ రాజీనామా చేశారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రెసిడెం‌ట్‌గా బాధ్యతలు చేపట్టాడని కూడా వార్తలు వస్తున్నాయి. దాంతో అభిమానులు అయోమయానికి గురయ్యారు.

బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే సౌరవ్‌ గంగూలీ రాజీనామా చేసారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా దాదా బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారని నెట్టింట పలు రూమర్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ  విషయంపై సౌరవ్‌ గంగూలీ కానీ బీసీసీఐ కానీ స్పందిస్తే తప్ప పూర్తి క్లారిటీ రానుంది. ఏదేమైనా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా ఆరు నెలల కాలానికి బీసీసీఐ కూర్చీ ఎక్కిన గంగూలీ.. రెండున్నరేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 

మరోవైపు ఐసీసీ ఛైర్మెన్‌ గ్రెగ్ బార్‌క్లే త్వరలో ఆ పదవి నుంచి తప్పుకోబోతుండడంతో.. సౌరవ్ గంగూలీ ఆ పొజిషన్‌ని చేపట్టబోతున్నట్టు నెట్టింట ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. అయితే ఐసీసీ ఛైర్మెన్‌గా దాదా బాధ్యతలు తీసుకోవాలంటే.. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా తన పదవికి గంగూలీ రాజీనామా చేయాల్సి ఉంటుంది. బీజేపీ కోసం అయినా లేదా ఐసీసీ ఛైర్మెన్‌ పదవి కోసం అయినా టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయక తప్పకపోవచ్చు. 

సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కరోనా వైరస్‌, లాక్‌డౌన్ వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటన్నింటిని అధిగమించి భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లారు. కరోనా సమయంలోనూ ఐపీఎల్ 2020 నిర్వహించి సూపర్ సక్సెస్ సాధించారు. 10 ఫ్రాంఛైజీలతో ఐపీఎల్ 2022ని నిర్వహించి మరో మెట్టు ఎక్కారు. ప్రసార హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి రూ.48 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టారు. అయితే దాదా హయాంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అందరికి మింగుపడడం లేదు. 

Also Read: ఈ జీతంతో మీకు పన్నులు కట్టాలా.. నా పిల్లలకు తిండి పెట్టాలా! ప్రధానిపై మహిళ ఆవేదన

Also Read: Vodafone Idea: వోడాఫోన్ ఐడియా యూజర్లకు బంపర్ ఆఫర్.. 28 రోజుల పాటు SonyLIV ఉచితం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Section: 
English Title: 
Breaking News: Team India Ex Captain Sourav Ganguly resigns as BCCI President, Fake News goes viral
News Source: 
Home Title: 

Sourav Ganguly Resign: బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా.. కొత్త ప్రెసిడెంట్ ఎవరంటే!

Sourav Ganguly Resign: బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా.. కొత్త ప్రెసిడెంట్ ఎవరంటే!
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

సౌరవ్‌ గంగూలీ సంచలన నిర్ణయం 

బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు
 

Mobile Title: 
బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా.. కొత్త ప్రెసిడెంట్ ఎవరంటే!
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Thursday, August 11, 2022 - 13:41
Request Count: 
88
Is Breaking News: 
No