India beat West Indies in 2nd T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో భారత్ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను 20 ఓవర్లలో 178 పరుగులకు కట్టడి చేసింది. దాంతో భారత్ 8 పరుగుల తేడాతో గెలిచి.. మరో మ్యాచ్ ఉండగానే పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయగా.. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన కోటా నాలుగు ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక నామమాత్రమైన చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.
187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి విండీస్ దూకుడుగా ఆడింది. పవర్ ప్లే ముగిసేరికి ఒక వికెట్ కోల్పోయి 46 రన్స్ చేసింది. యుజ్వేంద్ర చహల్ కైల్ మేయర్ (9)ను.. బ్రెండన్ కింగ్ (22) రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చారు. ఈ సమయంలో నికోలస్ పూరన్ (62), రోమన్ పావెల్ (58) అద్భుతంగా ఆడారు. ముందుగా వికెట్ కాపాడుకుని.. ఆపై బౌండరీలతో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
నికోలస్ పూరన్, రోమన్ పావెల్ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి హాఫ్ సెంచరీలు బాదారు. ఈ ఇద్దరి దూకుడుతోవిండీస్ విజయ లక్ష్యం రెండు ఓవర్లలో 29 పరుగులుగా మారింది. పూరన్, పావెల్ దంచుడు చూస్తే మ్యాచ్ గెలుస్తారేమో అన్న సందేహం కలిగింది. ఇక్కడే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్ వేసి పూరన్ వికెట్ తీసి 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దాంతో భారత్ రేసులోకి వచ్చింది. చివరి ఓవర్లో పావెల్ రెండు సిక్సులు బాదినా.. విండీస్ ఓడిపోక తప్పలేదు. కీరన్ పొలార్డ్ (3) పరుగులు చేశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది. టాస్ ఓడిన ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (2) ఔట్ అయ్యాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ (52: 41 బంతుల్లో 7×4, 1×6)తో కలిసి రోహిత్ శర్మ (18) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. ఇద్దరు క్రీజులో కుదురుకోవడంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ 49 పరుగులు చేసింది. అయితే ఎనిమిదో ఓవర్లో బ్రెండన్ కింగ్‌కి చిక్కి రోహిత్ పెవిలియన్ చేరాడు. కొద్దిసేపటికే సూర్యకుమార్ యాదవ్ (8) ఔట్ అయ్యాడు.
2ND T20I. India Won by 8 Run(s) https://t.co/er3AqDqkBj #INDvWI @Paytm
— BCCI (@BCCI) February 18, 2022
ఈ దశలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే అర్ధ శతకం పూర్తి చేసుకున్న కాసేపటికే అతడు బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ (52: 28 బంతుల్లో 7×4, 1×6), వెంకటేశ్ అయ్యర్ (33: 18 బంతుల్లో 4×4, 1×6) విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పంత్, అయ్యర్ బౌండరీల వర్షం కురిపించడంతో భారత్ స్కోర్ బోర్డు వేగంగా పరుగులు పెట్టింది. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న పంత్.. భారీ షాట్ ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక చివరిదైన మూడో టీ20 ఆదివారం జరగనుంది.
Also Read: Sunny Leone PAN Card: అయ్యో హతవిది.. గుర్తుతెలియని వ్యక్తి చేతిలో మోసపోయిన సన్నీ లియోన్!!
Also Read: Anasuya Bharadwaj: హలో.. నా వయసు 40 కాదు 36 మాత్రమే! జర్నలిస్ట్‌పై అనసూయ ఫైర్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook