Sourav Ganguly: తొలిసారిగా ఐపీఎల్ మధ్యలోనే నిలిచిపోవడంపై స్పందించిన BCCI President సౌరవ్ గంగూలీ

Sourav Ganguly on IPL 2021 Bio-Bubble Breach: అనూహ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) మధ్యలోనే నిలిచిపోయింది. సీజన్ మధ్యలోనే మ్యాచ్‌లు నిలిపివేసిన 14వ సెషన్ హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. 

Written by - Shankar Dukanam | Last Updated : May 6, 2021, 05:36 PM IST
Sourav Ganguly: తొలిసారిగా ఐపీఎల్ మధ్యలోనే నిలిచిపోవడంపై స్పందించిన BCCI President సౌరవ్ గంగూలీ

గతంలో 13 ఐపీఎల్ సీజన్లు జరిగినా, ఎన్నడూ లీగ్ మధ్యలో నిలిపివేసిన దాఖలాలు లేవు. కానీ అనూహ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) మధ్యలోనే నిలిచిపోయింది. సీజన్ మధ్యలోనే మ్యాచ్‌లు నిలిపివేసిన 14వ సెషన్ హాట్ టాపిక్ అవుతోంది. ఆటగాళ్లు, కోచ్, మైదాన సిబ్బందికి కరోనా సోకడంతో ఐపీఎల్ తాజా సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేయడం తెలిసిందే. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. 

ఐపీఎల్ 2021ను గత ఏడాది తరహాలోనే యూఏఈ వేదికగా నిర్వహించాలని మొదటగా భావించినట్లు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు. అయితే ఫిబ్రవరి సమయంలో నిర్ణయం తీసుకోగా భారత్‌లో కరోనా తీవ్రత తక్కువగా ఉందని, యూఏఈ కన్నా స్వదేశంలో నిర్వహిస్తే ప్రయోజనం ఉందని భావించినట్లు పేర్కొన్నాడు. కానీ అంతలోనే కరోనా సెకండ్ వేవ్‌లో ఉగ్రరూపం దాల్చడంతో బయో బబుల్ వాతావరణంలో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మైదాన సిబ్బంది సైతం కరోనా బారిన పడ్డారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఐపీఎల్ 2021(IPL 2021)ను నిరవధికంగా వేయాల్సి వచ్చిందని వివరించాడు.

Also Read: IPL 2021: ఆస్ట్రేలియా క్రికెటర్లకు టీ20 లీగ్స్‌పై జాతీయ బోర్డు కీలక సూచనలు, ఆదేశాలు

భారత్‌లో ఐపీఎల్ 14వ సీజన్ నిర్వహణ అనేది మాత్రం తప్పిదం కాదని అభిప్రాయపడ్డాడు. అయితే బయో బబుల్ వాతావరణంలో ఉన్న ఆటగాళ్లకు కరోనా ఎలా సోకిందని ప్రశ్నిస్తే, వివరించడం చాలా కష్టమన్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మరిన్ని విషయాలు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(Sourav Ganguly) ముచ్చటించాడు. ఫిబ్రవరిలో భారత్‌లో కోవిడ్19 కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, లేకపోతే తాము గత ఏడాది తరహాలోనే ఐపీఎల్ 2021ను సైతం యూఏఈలో నిర్వహించేవాళ్లమని పలు విషయాలు బహిర్గతం చేశాడు.

Also Read: IPL 2021: భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడమే అతిపెద్ద తప్పిదమంటూ మాజీ కెప్టెన్ ఆగ్రహం

కలిసికట్టుగా వ్యవహరించినా కరోనా కేసులు వస్తాయన్నాడు. ఒక్క కోవిడ్19 కేసులు లేకుండా లీగ్ నిర్వహించడం కష్టసాధ్యమని గంగూలీ అభిప్రాయపడ్డాడు. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ సైతం కొందరు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని గుర్తుచేశాడు. మాంచెస్టర్ సిటీ, అర్సెనల్ ఆటగాళ్లకు కరోనా సోకడం ఇబ్బందులకు గురిచేసింది. 6 నెలల సీజన్ కనుక మ్యాచ్‌లు రీషెడ్యూల్ చేశారు. ఐపీఎల్‌లో తక్కువ సమయంలో అతికష్టమ్మీద లీగ్ జరుగుతుంది. ఆటగాళ్లును వారి దేశాలకు పంపిన సందర్భాలలో మ్యాచ్‌లు రీషెడ్యూల్ చేయడం అంత తేలిక కాదని వివరించాడు.

Also Read: IPL 2021: CSK జట్టులో కరోనా కలకలం, బ్యాటింగ్ కోచ్ Michael Husseyకి కరోనా పాజిటివ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News