టీమిండియా లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni retires ) అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలకడం క్రికెట్ ప్రియులను షాక్‌కి గురిచేసింది. ధోనీ తీసుకున్న నిర్ణయంపై మన దేశానికి చెందిన క్రికెట్ దిగ్గజాలతో పాటు అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు సైతం ఒకరి తర్వాత మరొకరు స్పందిస్తున్నారు. ఐతే ఎవరెన్ని కామెంట్స్ చేసినా.. ఎవరెన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా.. మన ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ఏమంటుంది అనేదానిపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ( BCCI chief Sourav Ganguly ) సైతం ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటనపై తనదైన స్టైల్లో స్పందించాడు. Also read : Suresh raina: ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన సురేష్ రైనా
ధోని రిటైర్మెంట్‌తో క్రికెట్‌లో ఒక శకం ముగిసిందన్న గంగూలీ.. '' టీమిండియాతో పాటు వరల్డ్ క్రికెట్‌కి లభించిన ఒక గొప్ప ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ'' అంటూ ధోనీని ప్రశంసల్లో ముంచెత్తాడు. ధోని నాయకత్వ లక్షణాలతో ఎవ్వరూ సరితూగరని.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ధోనీ నాయకత్వాన్ని మించిన వాళ్లు లేరు అని గంగూలీ పేర్కొన్నాడు. Also read : MS Dhoni: ధోని మరో రెండేళ్లు ఆడతాడు
Also read : #Watch Suresh Raina: ధోనీ తర్వాత మళ్లీ తనే.. రోహిత్ శర్మపై రైనా ప్రశంసలు
Also read : IPL 2020: ఐపిఎల్ 2020లో అన్నీ సవాళ్లే: సురేష్ రైనా