IPL 2022: ఐపీఎల్​ 2022 మ్యాచ్​లన్నీ ఒకే నగరంలో.. బీసీసీఐ ఆలోచన అదేనా?

IPL 2022: కరోనా కారణంగా ఐపీఎల్ 15 సీజన్​ను కట్టుదిట్టంగా నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. దీనికి సంబంధించి ఓ నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 07:30 PM IST
  • ఐపీఎల్​ 2022పై బీసీసీఐ కొత్త ఆలోచన
  • టోర్నీ మొత్తం దేశీయంగానే నిర్వహించేలా కసరత్తు!
  • ఓ నివేదికలో కీలక విషయాలు వెల్లడి
IPL 2022: ఐపీఎల్​ 2022 మ్యాచ్​లన్నీ ఒకే నగరంలో.. బీసీసీఐ ఆలోచన అదేనా?

IPL 2022: మరికొన్ని నెలల్లో 15వ సీజన్ ఐపీల్​ ప్రారంభం కానుంది. కొవిడ్ థార్డ్​ వేవ్​ భయాల (Corona Third wave) నేపథ్యంలో ఐపీఎల్​ నిర్వహణపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఐపీఎల్​ మ్యాచ్​లన్నీ ఒకే నగరంలో జరిగే అవకాశాలున్నాయని (IPL 2022 in Mumbai only) ఓ నివేదిక వెల్లడించింది.

ఆ నివేదికలో ఇంకా ఏముందంటే..

ఈ ఏడాది ఏప్రిల్​లో ఐపీఎస్ ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే ప్రస్తుతం కొవిడ్ కేసులు, ఒమిక్రాన్​ వేరియంట్ భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో ముంబయిలోనే ఐపీఎల్ 2022​ మొత్తం మ్యాచ్​లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు (BCCI plan for IPL 2022) పేర్కొంది నివేదిక.

2021లో ఐపీఎల్​ ఇలా..

ఐపీఎల్​ 2021లోనూ దేశంలో కొవిడ్ భయాల కారణంగా ఏపీఎల్​ మ్యాచ్​లను కఠిన బయో బబుల్​ రూల్స్​తో ఆరు నగరాల్లో నిర్వహించాలని భావించింది (IPL 2021 details) బీసీసీఐ.

లీగ్​ దశలో పలు మ్యాచ్​లు అనుకున్నట్లుగానే జరిగాయి. అయితే బయో బబుల్​లో ఉన్నప్పటికీ.. కొంతమంది ప్లేయర్స్​, స్టాఫ్​ కరోనా బారిన పడటంతో.. తదుపరి మ్యాచ్​లను వాయిదా వేసింది బీసీసీఐ. అన్ని సర్దుకున్న తర్వాత సెప్టెంబర్​-అక్టోబర్​ మధ్య తిరిగి యూఏఈలో మిగతా మ్యాచ్​లను (Corona in IPL) నిర్వహించింది బీసీసీఐ.

అందుకే ఒకే నగరం..

అయితే ఈ సారి దేశీయంగానే.. అది కూడా ఆటగాళ్లు ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ముంబయలోనే అన్ని మ్యాచ్​లు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలా అయితే కొవిడ్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని బీసీసీఐ యోచిస్తున్నట్లు (BCCI on IPL 2022) నివేదికలో తేలింది.
అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందనేది.. బీసీసీఐ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

ఐపీఎల్​ మ్యాచ్​ల కన్నా ముందు ఫిబ్రవరిలో మెగా వేలం జరగాల్సి ఉంది. ఆ సమయానికి దేశంలో కొవిడ్ థార్డ్ వేవ్​ వస్తే.. వేలం ప్రక్రియ ఎలా నిర్వహించనున్నారు (IPL Mega Auction) అనే విషయం కూడా ఇప్పుడు చర్చ సాగుతోంది.

Also read: MS Dhoni - Haris Rauf: ఎంఎస్ ధోనీ స్పెషల్‌ గిఫ్ట్‌.. భావోద్వేగానికి గురైన పాకిస్తాన్ క్రికెటర్‌! మహీ మాటిస్తే అంతేమరి!!

Also read: Warner - Kohli: వైఫల్యాలు సహజమే.. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ విఫలమైనా ఫర్వాలేదు: వార్నర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News