India vs England ODI Series: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు Team Indiaను ప్రకటించిన బీసీసీఐ

Team India Squad For ODI Series Against England : ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న పేటీఎం వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రాబబుల్స్ ఆటగాళ్లను ప్రకటించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 19, 2021, 11:27 AM IST
  • ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా సుదీర్ఘ సిరీస్‌లు కొనసాగుతున్నాయి
  • టీ20 సిరీస్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు 2-2తో సమం
  • వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లను ప్రకటించింది
India vs England ODI Series: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు Team Indiaను ప్రకటించిన బీసీసీఐ

Team India Squad For ODI Series Against England: స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా సుదీర్ఘ సిరీస్‌లు కొనసాగుతున్నాయి. ఇదివరకే టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. తద్వారా ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం టీ20 సిరీస్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక టీ20 జరగనుంది. 

ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న పేటీఎం వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రాబబుల్స్ ఆటగాళ్లను ప్రకటించింది. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈ సిరీస్‌లో భారత జట్టుకు సారథిగా వ్యవహరించనుండగా, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ బాధ్యతలు చూసుకోనున్నాడు. పాండ్యా బ్రదర్స్‌కు అవకాశం ఇచ్చింది. తొలిసారిగా బౌలర్ ప్రసిద్ కృష్ణను ఎంపిక చేయడం గమనార్హం. 

Also Read: Yuvraj Singh Sixes: ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ 6, 6, 6, 0, 6తో వీర విహారం, Watch Video

ఇంగ్లాండ్‌తో జరగనున్న పేటీఎం వన్డే సిరీస్‌కు Team India ప్రాబబుల్స్‌..
 విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్.

Also Read: KL Rahul Duck Outs: కేఎల్ రాహుల్ 0, 1, 0, 0, అతడు ఛాంపియన్ అంటూ విరాట్ కోహ్లీ మద్దతు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News