పాక్ ను ఇంటికి పంపిన బంగ్లా ; ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేందుకు రెడీ

                                

Last Updated : Sep 27, 2018, 09:23 AM IST
పాక్ ను ఇంటికి పంపిన బంగ్లా ; ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేందుకు రెడీ

ఆసియాకప్: సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్ జట్టు మట్టికరిపించింది.  బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముష్ఫికర్‌ రహీమ్‌ (99), మహ్మద్‌ మిథున్‌ (60) అదర్భుత ప్రదర్శనతో బంగ్లా జట్టు పాక్ పై సునాయసంగా బంగ్లా జట్టు విజయం సాధించగల్గింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే మ్యాచ్ ప్రారంభం కాగానే తొలుత బ్యాటింగ్ కు దిగిన  బంగ్లా జట్టు 48.5 ఓవర్లలో 239 పరుగులు సాధించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఏమాత్రం పోరాటపటిమ కనబర్చలేకపోయింది. ఇమాముల్‌ హక్‌ (83)  ఒంటరి పోరాటం చేసినప్పటికీ అతని శ్రమ వృథా అయింది. లక్ష్యఛేదనలో తడబడిన పాకిస్థాన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఫలితంగా బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లా జట్టు ఆసియాకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో బంగ్లా జట్టు పటిష్ఠమైన భారత జట్టుతో తలపడనుంది.

Trending News