Alyssa Healy breaks Dhonis Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలుకొట్టిన అలీస్సా హేలీ

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీస్సా హేలీ (Alyssa Healy breaks Dhonis record of most dismissals) అధిగమించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఈ ఘనత సాధించింది అలీస్సా హేలీ.

Last Updated : Sep 27, 2020, 02:21 PM IST
Alyssa Healy breaks Dhonis Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలుకొట్టిన అలీస్సా హేలీ

బ్రిస్బేన్: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) రికార్డును ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీస్సా హేలీ అధిగమించింది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక బ్యాట్స్‌ఉమెన్లను ఔట్ చేసిన వికెట్ కీపర్‌గా అలీస్సా హేలీ (Alyssa Healy) నిలిచింది. న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియాకు జరుగుతున్న 3 టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో మహిళా వికెట్ కీపర్ హేలీ ఈ ఘనత (Alyssa Healy breaks Dhonis record of most dismissals in T20Is) సాధించింది. 

టీ20లలో ఎంఎస్ ధోనీ 91 మంది బ్యాట్స్‌మెన్ల ఔట్ల (క్యాచ్ + స్టంపింగ్)లో భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పటివరకూ ఇదే అత్యధికం, కాగా న్యూజిలాండ్‌లో జరుగుతున్న 2వ టీ20లో 92 వికెట్‌లో భాగస్వామి కావడం ద్వారా.. అత్యధిక బ్యాట్స్‌మెన్ ఔట్లలో భారత మాజీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీని అధిగమించి ఆసీస్ కీపర్ అలీస్సా హేలీ నెంబర్ వన్‌గా నిలిచింది.   

Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్‌పై షేన్ వార్న్ ప్రశంసలు, ఆశ్చర్యం 

 

ఫొటో గ్యాలరీలు

 

Trending News