India vs Australia 2nd ODI Live Score: సిడ్నీ వేదికగా మరో సమరం ప్రారంభమైంది. తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్ ఈ రోజు ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మైదానంలోకి అడుగుపెట్టింది. భారత్, ఆస్ట్రేలియా (India vs Australia 2nd ODI) మధ్య రెండో వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా.. గెలిచి సిరీస్‌లో నిలవాలని భారత్ భావిస్తుంటే, ఆసీస్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఆసీస్ కేవలం ఒకే ఒక్క మార్పుతో ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగింది. స్టోయినిస్ స్థానంలో హెన్రిక్స్ బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇండియా ఎలాంటి మార్పులు లేకుండానే ఆసీస్‌తో పోరాడేందుకు సిద్ధమైంది. Also read: India vs Australia: భారత క్రికెటర్లకు జరిమానా విధించిన ఐసీసీ
Australia have opted to bat in the second #AUSvIND ODI 🇦🇺
Can they seal the series today and go atop the ICC Men's @cricketworldcup Super League table? pic.twitter.com/wKYcX8gTUA
— ICC (@ICC) November 29, 2020
ఇరు జట్ల క్రీడాకారులు
భారత్ టీం: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా, చాహల్.
ఆస్ట్రేలియా టీం: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవెన్ స్మిత్, లబుచేన్, హెన్రిక్స్, క్యారీ, మ్యాక్స్‌వెల్, కమ్మిన్స్, స్టార్క్ , జంపా, హాజిల్ వుడ్, ఆడం జంపా.
- Also Read : India vs Australia 1st ODI Highlights: శతక్కొట్టిన స్మిత్, ఫించ్.. తొలి వన్డేలో భారత్ పరాజయం
-
Also read: Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4GApple Link - https://apple.co/3loQYe