Athiya Shetty-KL Rahul Wedding: ఫామ్ హౌస్‌లో కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి.. స్పష్టం చేసిన సునీల్ శెట్టి! వీడియో వైరల్

KL Rahul and Athiya Shetty to tie the knot on 2023 January 23. టీమిండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ బ్యూటీ అతియా శెట్టి 2023 జనవరి 23న వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 22, 2023, 03:22 PM IST
  • ఫామ్ హౌస్‌లో కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి
  • స్పష్టం చేసిన సునీల్ శెట్టి
  • వీడియో, ఫొటోస్ వైరల్
Athiya Shetty-KL Rahul Wedding: ఫామ్ హౌస్‌లో కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి.. స్పష్టం చేసిన సునీల్ శెట్టి! వీడియో వైరల్

Suniel Shetty confirms KL Rahul and Athiya Shetty Wedding Date and Venue: టీమిండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ బ్యూటీ అతియా శెట్టి సోమవారం (జనవరి 23) మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు. చాలాకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ లవ్‌ బర్డ్స్‌ వివాహం.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టికి చెందిన విలాసవంతమైన ఫామ్ హౌస్‌లో జరగనుంది. మహారాష్ట్ర ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌ ఇప్పటికే అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రాహుల్, అతియా పెళ్లి వేడుక ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆదివారం (జనవరి 22) మధ్యాహ్నం అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి పెళ్లి (Athiya Shetty KL Rahul Marriage) పనులు చూసేందుకు ఖండాలాలోని తన విలాసవంతమైన ఫామ్ హౌస్‌కు వచ్చారు. ఇప్పటికే ప్రి-వెడ్డింగ్ వేడుక పూర్తికాగా.. నేడు మెహందీ, హల్దీ కార్యక్రమాలు జరగనున్నాయి. మెహందీ, హల్దీ కార్యక్రమాలతో పాటు పెళ్లి పనులు చూసేందుకు సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా.. గేట్ బయట కారు ఆపి మీడియాతో మాట్లాడాడు. 'రేపు నేను పిల్లలను తీసుకువస్తాను. మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు. రేపు ఫ్యామిలీ అంతా బయటకు వచ్చి మీడియాకు ఫోజులిస్తాం' అని చెప్పారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి పెళ్లికి రెండు వైపుల నుంచి 100 మంది అతిథులు (Athiya Shetty KL Rahul Marriage Guests) మాత్రమే హాజరవుతారని సమాచారం తెలుస్తోంది. ఈ వివాహానికి బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఎక్కువగా రాకపోవచ్చని సమాచారం. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్‌ కుమార్ లాంటి సీనియర్లు మాత్రమే వస్తారట. మరోవైపు క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం కుటుంబసమేతంగా హాజరయ్యే అవకాశం ఉంది. పెళ్లి సమయంలో అందరి మొబైల్ ఫోన్లు కూడా దూరంగా ఉంచుతారని (నో ఫోన్ పాలసీ) తెలుస్తోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkvilla (@pinkvilla)

జనవరి 23న ఖండాలాలో వివాహం జరిగిన కొన్ని వారాల తర్వాత.. కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి జంట ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారని సమాచారం. ఈ వేడుకకి మాత్రం రాజకీయ, సినీ, వ్యాపార, క్రికెట్ రంగానికి చెందిన అందరూ హజావుతారట. పెళ్లి కారణంగానే ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీసుకు కేఎల్‌ రాహుల్‌ దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు. 

Also Read: Rohit Sharma Form: కొంతకాలంగా పెద్ద స్కోర్లు చేయలేదు.. రోహిత్ శర్మ తన ఫామ్ గురించి ఏమన్నాడంటే?  

Also Read: నా బయోపిక్‌ తీస్తే ఊరుకునేది లేదు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు! కలల ప్రాజెక్ట్ అంటూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News