Asia Cup 2022: రేపే టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్‌..శ్రీలంకతో కీలక పోరు..తుది జట్లు ఇవే..!

Asia Cup 2022: ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌ కీలకం కానుంది. ఈనేపథ్యంలో రేపు శ్రీలంకతో భారత జట్టు తలపడనుంది.

Written by - Alla Swamy | Last Updated : Sep 5, 2022, 03:35 PM IST
  • ఆసియా కప్‌ 2022
  • రసవత్తరంగా సూపర్‌-4
  • రేపు మరో కీలక మ్యాచ్
Asia Cup 2022: రేపే టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్‌..శ్రీలంకతో కీలక పోరు..తుది జట్లు ఇవే..!

Asia Cup 2022: ఆసియా కప్‌లో నిలవాలంటే టీమిండియా ఇకపై ప్రతి మ్యాచ్‌ గెలవాల్సి ఉంటుంది. సూపర్‌-4లో రెండో స్థానంలో ఉండాలంటే శ్రీలంక, అఫ్ఘనిస్థాన్‌పై భారీ స్థాయిలో విజయం సాధించాలని విశ్లేషకులు చెబుతున్నారు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఊహించని విధంగా భారత్ ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో అదరగొట్టినా..బౌలింగ్‌లో తేలిపోయింది. చివరి ఓవర్లలో దారుణంగా పరుగులు ఇచ్చి..ఓటమిని మూటగట్టుకుంది.

ఈనేపథ్యంలో ఇకపై రెండు మ్యాచ్‌లు టీమిండియాకు కీలకం కానున్నాయి. ఆసియా కప్ సూపర్-4లో భాగంగా రేపు(మంగళవారం) శ్రీలంకను భారత్ ఢీకొట్టనుంది. రేపు రాత్రి 7.30 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కావడంతో చావోరేవో అన్నట్లు భారత్ మైదానంలోకి దిగనుంది. ఈమ్యాచ్‌లో రెండు మూడు మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ ప్లేయర్ దినేష్‌ కార్తీక్ జట్టులోకి రానున్నాడు.

దీంతో రిషబ్ పంత్ బెంచ్‌కు పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్‌ హుడాను పక్కకు పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తీసుకునే అవకాశం ఉంది. దారుణంగా పరుగులు ఇచ్చిన భువనేశ్వర్‌ను బెంచ్‌కు పరిమితం చేసే అవకాశం లేదు. ఐతే యువ పేసర్ అర్ష్‌దీప్‌ బదులు అవేష్‌ ఖాన్‌ను తీసుకునే సూచనలు ఉన్నాయి. మొత్తంగా గెలుపే లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగనుంది.

ఇటు శ్రీలంక సైతం స్ట్రాంగ్‌గా ఉంది. తొలి మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్‌తో ఓడినా..రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఇంటికి పంపించింది. సూపర్-4లో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అఫ్ఘనిస్థాన్‌పై ప్రతికారం తీర్చుకుంది. వరుసగా రెండు విజయాలతో లంక మంచి ఊపు మీద ఉంది. అదే స్ఫూర్తితో భారత్‌ను ఓడిస్తామంటున్నారు లంకేయులు. గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జట్టునే శ్రీలంక ఆడించే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ఇరు జట్లు బలంగా కనిపిస్తోంది. దీంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

భారత జట్టు(అంచనా)..

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ,సూర్యకుమార్ యాదవ్, దినేష్‌ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్షర్‌పటేల్, భువనేశ్వర్, అవేష్‌ఖాన్, చాహల్, రవి బిష్ణోయ్.

శ్రీలంక జట్టు(అంచనా)..

నిస్సంక, కుశాల్ మెండిస్, అసలంక, గుణతిలక, శనక, రాజపక్స, హసరంగ, కరుణరత్నే, తీక్షణ, ఫెర్నాడో, మధుశంక.

Also read:Aravind Swamy in NBK 108: బాలకృష్ణ సినిమాలో అరవింద్ స్వామి.. షాకింగ్ పాత్రలో?

Also read:Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం సోరెన్..ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News