Ashish Nehra: అది మార్చుకోకపోతే టీమిండియాలోకి Manish Pandey కష్టమే

Ashish Nehra On SRH Player Manish Pandeys Weakness: ఒకటి రెండు ఓవర్లకు ముందే మ్యాచ్ ముగిస్తారని భావించిన టీమ్ మేనేజ్‌‌మెంట్ సహా మ్యాచ్ వీక్షిస్తున్న సన్‌రైజర్స్ అభిమానులు సైతం 6 పరుగుల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 15, 2021, 06:48 PM IST
Ashish Nehra: అది మార్చుకోకపోతే టీమిండియాలోకి Manish Pandey కష్టమే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నాటకీయ పరిణామాల నడుమ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెందింది. ఒకటి రెండు ఓవర్లకు ముందే మ్యాచ్ ముగిస్తారని భావించిన టీమ్ మేనేజ్‌‌మెంట్ సహా మ్యాచ్ వీక్షిస్తున్న సన్‌రైజర్స్ అభిమానులు సైతం 6 పరుగుల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. జరిగిన రెండు మ్యాచ్‌లలో చివరి నిమిషంలో తప్పిదాల కారణంగా జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది.

రెండు మ్యాచ్‌లలో ఇతర ఆటగాళ్లతో పోల్చితే అధిక సమయం క్రీజులో నిల్చుని, ఎక్కువ బంతులు ఆడిన ఏకైక ఆటగాడు మనీశ్ పాండే. తొలి మ్యాచ్ ఓటమి అనంతరం మనీశ్ పాండే అవసరానికి తగ్గట్లుగా గేర్ మార్చి ఆడకపోవడంతోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణమని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పరోక్షంగా విమర్శించాడు. రెండో మ్యాచ్ ముగిసిన తరువాత అదే విమర్శలు తాజా, మాజీ క్రికెటర్లు చేస్తున్నారు. వాస్తవానికి మనీశ్ పాండే క్లాస్ ప్లేయర్. కానీ అవసరానికి తగ్గట్లుగా ఆడకుండా, తనకు నచ్చిన తీరుగా బ్యాటింగ్ కొనసాగిస్తాడు ఈ కారణంగానే అతడిని టీమిండియా(Team India) గుర్తుంచుకోదని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు.

Also Read: IPL 2021 RR vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు రాజస్తాన్ రాయల్స్ బ్రేక్ వేస్తుందా

‘వాస్తవానికి 2015లోనే మనీశ్ పాండే తన టాలెంట్‌తో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అయితే పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయడం మాత్రం అతడు అలవరుచుకోలేదు. ఇదే కారణంగా IPL 2021 గత రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. టీమిండియాకు ఆడే సమయంలోనూ మనీశ్ పాండే పరిస్థితులను అంచనా వేసిగానీ, లేక అప్పటి పరిస్థితి అర్థం చేసుకుని బ్యాటింగ్ కొనసాగించడు. అతడి తరువాత జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(Hardik Pandya), రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు.

పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం వల్లే వారికి అవకాశాలు వచ్చాయి. కానీ మనీశ్ పాండేలో ఇదే లోపించిన కారణంగా అతడు టీమిండియాలో రెగ్యూలర్ ఆటగాడిగా చోటు సుస్థిరం చేసుకోలేకపోయాడని’ టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అయితే మరో అడుగు ముందుకేసి మనీశ్ పాండేకు తరువాతి మ్యాచ్‌లలో చోటు దక్కదని సైతం వ్యాఖ్యానించాడు. కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాడి సేవలు జట్టుకు చాలా అవసరమని, తక్కువ స్కోర్ మ్యాచ్‌లలో అతడు జట్టుకు కీలకంగా మారతాడని జడేజా అభిప్రాయపడ్డాడు. 

Also Read: Virat Kohli: అప్పటి నుంచి తన జీవితం మారిపోయిందంటున్న RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News