Sachin Tendulkar shared video sushila meena: ప్రస్తుతం సోషల్ మీడియా హావా నడుస్తొందని చెప్పుకొవచ్చు. చాలా మంది తమ టాలెంట్ ను వీడియోలు, రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంత మంది దగ్గర టాలెంట్ ఉంటుంది. కానీ వారికి అంతగా గుర్తింపు ఉండదు. ఇటీవల కొంత మంది అనుకొకుండా చేస్తున్నారో.. కావాలని చేస్తున్నారో కానీ.. వారు రీల్స్, వీడియోలు చేసిన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటే.. అవి వైరల్ గా మారిపోతున్నాయి.
ఒక వేళ నిజంగా.. ఆ వీడియోలో లేదా రీల్స్ లలో సదరు వ్యక్తికి టాలెంట్ ఉంటే.. వారు ఓవర్ నైట్ లో పాపులారీటీ సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, జరిగిన ఒక ఘటన మాత్రం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు. సచిన్ టెండుల్కర్ రాజస్థాన్ కు చెందిన ఒక 12 ఏళ్ల బాలిక.. సుశీలా మీనా క్రికెడ్ ఆడుతుంది. ఆమె తన ఎడమ చేతితో స్పీడ్ గా వచ్చి బౌలింగ్ చేస్తుంది.
Smooth, effortless, and lovely to watch! Sushila Meena’s bowling action has shades of you, @ImZaheer.
Do you see it too? pic.twitter.com/yzfhntwXux— Sachin Tendulkar (@sachin_rt) December 20, 2024
అయితే.. ఆమె బౌలింగ్ స్టైల్ అచ్చం జహీర్ ఖాన్ లా ఉండటంతో.. సచిన్ టెండుల్కర్ ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి.. జహీర్ ఖాన్ కు ట్యాగ్ చేసి అచ్చం.. నీలాగే బౌలింగ్ చేస్తుంది.. చూశావా.. అని కామెంట్ జతపర్చారు. దారికి జహీర్ ఖాన్.. యస్ చూశాను.. అచ్చం అదే స్టైల్ అంటూ రిప్లై కూడా ఇచ్చారంట. అయితే.. సచిన్ ఎప్పుడైతే.. వీడియో షేర్ చేశారో.. ఆమె వెంటనే ఒక రేంజ్ లో వైరల్ అయిపోయి ఫెమస్ అయిపోయింది.
ఆమె బౌలింగ్ స్టైల్ ను చూసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తి చూపించారంట. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమెకు అనుకుని విధంగా లక్ కలిసి వచ్చిందంట. ఈ వీడియోను చూసి ఆదిత్య బిర్లా గ్రూప్ సదరు యువతికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందంట.
Read more: Viral Video:ఇదెక్కడి విడ్డూరం.. చిరుతను అమాంతం లాక్కెళ్లిపోతున్న గద్ద.. షాకింగ్ వీడియో వైరల్..
ఆమెకు క్రికెట్ లో రాణించడానికి అన్ని విధాలుగా ట్రైనింగ్ ను తాము దగ్గరుండి ఇప్పిస్తామని, దీనికయ్యే ఖర్చంతా కూడా భరిస్తామని కూడా ఆదిత్య బిర్లా గ్రూప్ చెప్పిందంట. తమ పథకం..ఫోకస్ ఫర్ గుడ్ అనే కార్యక్రమంద్వారా యువతికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా ఆదిత్య బిర్లా ప్రకటించినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter