ఐదో వన్డేలో టీమిండియా బంపర్ విక్టరీ....సిరీస్ భారత్ వశం

                                           

Last Updated : Nov 1, 2018, 06:08 PM IST
ఐదో వన్డేలో టీమిండియా బంపర్ విక్టరీ....సిరీస్ భారత్ వశం

విండీస్ తో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది.   9 వికెట్ల తేడాతో విండీస్ జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వివరాల్లోకి వెళ్లినట్లయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరేబియన్లు ఆది నుంచి ఏ మాత్రం పోరాటపటిమ కనబర్చలేదు.. జడేజా స్పీన్ మాయాజాలానికి ఒకోనొక దశలో విండీస్ 66 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది. ఇదే పంథాను కొనసాగిస్తూ చివరకు 31.5 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ క్రమంలో 105 పరుగుల స్పల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన కోహ్లీ సేన..అలవోగకగా లక్ష్యాన్ని చేధించింది. కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో టార్గెట్ ను చేధించింది. ఫలితంగా సిరీస్ లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది కోహ్లీసేన. రవీంద్ర జడేజా కీలక మైన నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా...ఖలీల్ అహ్మద్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసి భారత్ కు అద్భుత విజయాన్ని అందించారు.  ఇదిలా ఉండగా ఐదువన్డేల సిరీస్ ను 3-1 తేడాతో కోహ్లీ సేన కైవసం చేసుకుంది. 

 

Trending News