Significance of kanuma festival: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో కనుమ కూడా ఒకటి. దీన్నే పశువుల పండుగ లేదా రైతుల పండుగ అంటారు. ఈ ఫెస్టివల్ రోజున పశువులకు అందంగా అలంకరించి పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుతారు. తెలుగు లోగిళ్లలో ఈ రోజున కోడి పందాలు, పొట్టేలు పోటీలు, ఎడ్ల పందాలను జరుపుతారు. అంతేకాకుండా ఇదే రోజున తమిళనాడులో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. 2024లో కనుమ పండగను జనవరి 16న జరుపుకోనున్నారు. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం.
కనుమ రోజున ప్రయాణాలు చేయడం నిషిద్ధం. ఈరోజు ట్రావెల్ చేస్తే అశుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ పండుగ రోజున మినుములు తప్పనిసరిగా తినాలంటారు పెద్దలు. అందులో భాగంగానే మినుములతో చేసిన గారెలను తింటారు. కనుమ రోజున పశువులతో ఎటువంటి పనులు చేయించరు. ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి.. మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు కడతారు. అంతేకాకుండా వాటిని అందంగా ముస్తాబు చేసి కొత్త ధాన్యంతో వండిన పొంగలిని పెడతారు. ఈ రోజున పశువులను తమ కుటుంబంలోని సభ్యులుగా భావిస్తారు.
ఈరోజున పల్లెటూళ్లలో తీర్థాలు జరుగుతాయి. కొత్త అల్లుళ్లుతో ఇళ్లన్నీ కలకళ్లాడుతాయి. పూర్వీకులను తలచుకుని మాంసాహారం తింటారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి భోజనాలు చేస్తారు. ఈరోజున చిన్నా, పెద్ద అంతా కలిసి గాలిపటాలు ఎగురవేస్తారు. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధిరంచడం శుభప్రదంగా భావిస్తారు.
Also Read: Grah Gochar in Jan 2024: జనవరిలో ఈ మూడు రాశులకు అదృష్టం, ఐశ్వర్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.