Weekly Horoscope: ఈ వారం ఈ 3 రాశులవారు ధనవంతులు అవుతారు!

Weekly Horoscope: దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్న వేళ.. ఈ వారం మూడు రాశులవారికి కలిసి రానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2022, 11:23 AM IST
Weekly Horoscope: ఈ వారం ఈ 3 రాశులవారు ధనవంతులు అవుతారు!

Weekly Horoscope 15 to 21 August 2022:  ఆగస్టు మూడో వారం దేశమంతటికీ చాలా ప్రత్యేకం. ఇవాళే దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల్ని జరుపుకుంటోంది. మువ్వన్నెల జెండాతో ఈ రోజు అంటే ఆగస్టు 15న దేశమంతా రెపరెపలాడుతోంది. ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ వారం (Weekly Horoscope) కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆగస్టు 18న సూర్యుడు మరియు గ్రహ స్థానాల సంచారం వలన 3 రాశుల వారు భారీగా లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ వారపు అదృష్ట రాశులు..
వృషభం (Taurus) -ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభం నుండి అధిక మెుత్తంలో డబ్బు అందుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయం అనేక మార్గాల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ వారం చివరిలో శుభవార్త వినే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.  
కుంభ రాశి(Aquarius)- కుంభరాశి వారికి ఈ వారం అదృష్టం తోడై ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారం బాగుంటుంది. 
మీన రాశి (Pisces)- ఆగస్టు మూడో వారం మీన రాశి వారికి కలిసి వస్తుంది. వీరు భారీగా ధనాన్ని సంపాదిస్తారు.  ఆర్థిక సమస్యలు నుంచి గటెక్కుతారు. ఆదాయం పెరగవచ్చు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. టూర్ వెళ్లే అవకాశం  ఉంది. మెుత్తం మీద ఈ వారం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది.  

Also Read: Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు, శుభముహూర్తం, పూజా వివరాలు మీ కోసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News