Vinayaka chavithi 2021: వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది ? చూస్తే Mithya Dosha నివారణ ఏంటి ?

Vinayaka chavithi 2021: What is Mithya Dosha ? వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దని అంటుంటారు. చవితి నాడు చంద్రుడుని చూస్తే నీలాపనిందలు మోయక తప్పదని, అందుకే చంద్రుడిని చూడొద్దని చెబుతుంటారు. అయితే, చంద్రుడిని ఎందుకు చూడొద్దంటారు, అలా చెప్పడానికి వెనుకున్న కారణం ఏంటి ? అనేది మాత్రం కొంతమందికే తెలుసు. ఆ నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Pavan | Last Updated : Sep 10, 2021, 09:09 PM IST
  • వినాయక చవితి నాడు చంద్రుడుని చూస్తే నీలాపనిందలు తప్పవా ?
  • చంద్రుడు వినాయకుడి ఆగ్రహానికి గురవడానికి కారణం ఏంటి ?
  • చవితి నాడు చంద్రుడిని చూసినందుకు శ్రీకృష్ణుడికే తప్పని నిందలు
Vinayaka chavithi 2021: వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది ? చూస్తే Mithya Dosha నివారణ ఏంటి ?

Vinayaka chavithi 2021: What is Mithya Dosha ? వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దని అంటుంటారు. చవితి నాడు చంద్రుడుని చూస్తే నీలాపనిందలు మోయక తప్పదని, అందుకే చంద్రుడిని చూడొద్దని చెబుతుంటారు. అయితే, చంద్రుడిని ఎందుకు చూడొద్దంటారు, అలా చెప్పడానికి వెనుకున్న కారణం ఏంటి ? అనేది మాత్రం కొంతమందికే తెలుసు. ఆ నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక చవితి నాడు తనకు బాగా ఇష్టమైన ఉండ్రాళ్ల పాయాసం (Vundralla payasam) ఆరగించిన ఆయాసంతో బాధపడుతున్న వినాయకుడు తన మూషిక వాహనంపై వెళ్లడం చూసి చంద్రుడు ఫక్కున నవ్వాడట. 

అప్పటికే ఆయాసంతో బాధపడుతున్న తనను చూసి చంద్రుడు (Moon god) నవ్వడంతో వినాయకుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నన్నే చూసి నవ్వుతావా అని చంద్రుడిపై మండిపడుతూ.. ''ఇక నీ వెలుతురు భూమ్మీద సోకదుగాక'' అని శపించాడట.

వినాయకుడి ఆగ్రహానికి గురైన చంద్రుడు.. ఆ శాపంతో (Lord Ganesh curse to moon) తన శక్తిని, ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని తెలుసుకుని వెంటనే వినాయకుడిని క్షమించమని వేడుకున్నాడట.

Also read : Ganesh Chaturthi 2021: వినాయక చవితి ప్రాముఖ్యత, తిథి ముహూర్తం, ఇష్టమైన ప్రసాదం

చంద్రుడు వేడుకోవడంతో కొంత చల్లబడిన వినాయకుడు.. శాపం తీవ్రత తగ్గిస్తూ ఇకపై వినాయక చవితి నాడు (Vinayaka Chavithi) నిన్ను ఎవ్వరు చూసినా వాళ్లు నీలాపనిందలు మోయక తప్పదు అని శపించాడట. అలా చేయడం వల్ల ఆరోజు నాడు నిన్ను ఎవ్వరు చూడరనేది వినాయకుడు పెట్టిన శాపం. 

Shri Krishna and Mithya Dosha శ్రీకృష్ణుడికే తప్పని నిందలు :
వినాయకుడి శాపం కారణంగానే వినాయక చవితి నాడు నెలవంక చూసిన శ్రీకృష్ణుడు కూడా మిత్య దోష బారినపడి శ్యమంతక మణి (Syamantaka mani) దొంగిలించాడనే నింద మోయాల్సి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

Mithya Dosha nivarana: మిత్స దోష నివారణ ఉపాయం చెప్పిన నారథుడు
అయితే, శ్రీకృష్ణుడు చేయని తప్పుకు నింద మోయడానికి ఆయన వినాయక చవితి రోజు (Vinayaka chavithi) చంద్రుడి వంక చూడటమే కారణం అని గ్రహించిన నారథ మహర్షి.. వినాయకుడి ఉపవాసం (Fasting for Lord Vinayak) చేస్తే ఆ నింద తొలగిపోతుందని మిత్య దోష నివారణ సూచించాడట. అలా శ్రీకృష్ణుడు (Lord Krishna) ఆ దోషం నుంచి బయటపడ్డాడని పురాణ ఇతిహాసాలు చెబుతుంటాయి.

Also read : Financial lessons from Lord Vinayaka :వినాయకుడి నుంచి తెలుసుకోవాల్సి ఆర్థిక పాఠాలు ఇవే

Mithya Dosha nivarana mantra: మిత్స దోష నివారణ మంత్రం:
గణేష్ చతుర్థి నాడు ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూసినట్టయితే.. ఆ దోష నివారణ కోసం ఈ మంత్రి పఠిస్తే ప్రయోజనం ఉంటుందట.
సింహః ప్రసెనమవధీత్సింహో జాంబవత హతః 
సుకుమారక మారోదిత్సవ హ్యేష శ్యమంతకః 

Also read : Ludhianas chocolate Ganesh: ఈ చాక్లెట్‌ గణేశుడిని పాలల్లో నిమజ్జనం చేసి ఏం చేస్తారో తెలుసా? 500 మంది పేద పిల్లలకు సాయం చేసే కార్యక్రమం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News