Venus Transit 2023: శనిదేవుడి రాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారు ధనవంతులవ్వడం పక్కా..

Venus Transit 2023: జనవరి 22న శుక్రుడు తన మిత్రుడి రాశి అయిన కుంభరాశిలో సంచరించనున్నాడు. దీని వల్ల మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులు ఏమిటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 10:44 AM IST
Venus Transit 2023: శనిదేవుడి రాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారు ధనవంతులవ్వడం పక్కా..

Shukra Gochar Effects: జ్యోతిష్యంలో ప్రతి గ్రహానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంటుంది. అది వ్యక్తి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. సూర్యభగవానుడు కీర్తి మరియు గౌరవానికి కారకుడు సూర్యభగవానుడు అయితే.. ఆనందం మరియు ఐశ్వర్యానికి ఇచ్చే గ్రహం శుక్రుడు. జనవరి 22న శుక్రుడు తన మిత్రుడైన కుంభరాశిలో (Venus Transit 2023) సంచరించబోతున్నాడు. కుంభంలో శుక్రుడి సంచారం వల్ల మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ అదృష్ట రాశులేమిటో తెలుసుకుందాం. 

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
వృషభం (Taurus): వృషభ రాశి వారికి లగ్నానికి మరియు ఆరవ ఇంటికి శుక్రుడు అధిపతి. శుక్రుడి సంచారం వల్ల వృషభరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. స్త్రీలు కొత్త ఉద్యోగం చేసే అవకాశం ఉంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుక్రుని ఆశీర్వాదం వల్ల ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.
తులారాశి (Libra): తుల రాశి యెుక్క ఎనిమిదవ మరియు లగ్న ఇంటికి శుక్రుడు అధిపతి. శుక్రుని సంచారం కారణంగా మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు సపోర్టు లభిస్తుంది. సినిమా మరియు కళలతో సంబంధం ఉన్న మహిళలకు ఈ సమయం అద్బుతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. 
కుంభ రాశి (Aquarius): శుక్రుడు లగ్నము నుండి ఈ రాశిలో సంచరించనున్నాడు. మీరు ఆనందాన్ని పొందుతారు. వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పార్టనర్ షిప్ తో ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 

Also Read: Shukra Shani Yuti 2023: 30 ఏళ్ల తర్వాత కుంభంలో మిత్రుల కలయిక... వీరి ఇంటి నిండా డబ్బు కట్టలే ఇక.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News