Venus Transition 2022 : వృషభ రాశిలోకి శుక్రుడు.. జూన్ 18 తర్వాత ఆ రెండు రాశుల వారికి శుభ యోగం...

జ్యోతిష్యంలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో శుక్ర సంచారం బలంగా ఉంటే ఆ వ్యక్తులు సుఖ సంతోషాల్లో మునిగిపోతారు. శుక్ర సంచారం వారికి ఆర్థికంగా కలిసొస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2022, 03:38 PM IST
  • ఈ నెల 18న రాశి మారనున్న శుక్రుడు
  • మేష రాశి నుంచి వృషభ రాశిలోకి శుక్రుడు
  • శుక్ర సంచారంతో ఆ రెండు రాశుల వారికి శుభ యోగం
Venus Transition 2022 : వృషభ రాశిలోకి శుక్రుడు.. జూన్ 18 తర్వాత ఆ రెండు రాశుల వారికి శుభ యోగం...

Venus Transition Effect 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాలు వ్యక్తుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఏదేని గ్రహం రాశిచక్రం మారినట్లయితే.. అది రాశిచక్రంలోని అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. అది కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు కలగజేయవచ్చు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలగజేయవచ్చు. ఈ నెల 18న శుక్రుడు రాశిచక్రం మారబోతున్నాడు. ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. 

సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రుడిని  సుఖ, సంతోషాలకు, విలాసవంతమైన జీవితానికి సంకేతంగా భావిస్తారు. జాతకంలో శుక్రుని స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి గతులు, ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటాయి. ఒకవేళ శుక్రుడి స్థానం బలహీనంగా ఉంటే ఆ విషయాల్లో అంతా తలకిందులుగా ఉంటుంది.ఈ నెల 18న శుక్రుడు రాశి మారనున్న నేపథ్యంలో 2 రాశుల వారికి బాగా కలిసిరానుంది.

మిథునం:

శుక్రుడి రాశి మార్పు మిథున రాశివారికి భారీ లాభాలను తీసుకొస్తుంది. ఏ పనిలోనైనా విజయం చేకూరుస్తుంది. చేతినిండా పనులతో బిజీగా గడుపుతారు. పెద్దగా కష్టపడకుండానే సులువుగా అన్ని పనులు పూర్తి చేస్తారు. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. పెట్టుబడులకు కూడా ఇది అనువైన సమయం. పరిశ్రమ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కెరీర్, వ్యక్తిగత జీవితంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

సింహరాశి :

సింహ రాశి వారికి శుక్ర సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక రాబడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో చాలా గౌరవం పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ప్రతిష్ఠ పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. కొత్త ఉద్యోగంలోకి మారేందుకు అనువైన సమయం. పరిశ్రమ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఈ సమయం విద్యార్థులకు వరంలా ఉంటుంది.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం మతపరమైన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.)

Also Read: Horoscope Today June 8th : నేటి రాశి ఫలాలు... ఆ రాశి వారికి లవ్ ప్రపోజ్‌కు అనుకూలమైన రోజు...

Also Read: Vastu Tips for Home Cleaning: ఇంటిని ఇలా శుభ్రం చేస్తే.. లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Home Cleaning TipsHome Cleaning

 

Trending News