Venus Transit 2023: ఇవాళ్టి నుంచి 25 రోజుల తరువాత ఆ మూడు రాశులకు అంతా డబ్బే డబ్బు

Venus Transit 2023: ఫిబ్రవరి 15 నుంచి శుక్రుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశిపరివర్తనం కారణంగా మూడు రాశులపై రాజయోగం ఉంటుంది. శుక్రగోచారం కారణంగా ఆ మాడు రాశులకు అంతులేని సంపద, సుఖ సంతోషాలు లభిస్తాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 22, 2023, 07:19 AM IST
Venus Transit 2023: ఇవాళ్టి నుంచి 25 రోజుల తరువాత ఆ మూడు రాశులకు అంతా డబ్బే డబ్బు

ఎక్కడో అంతరిక్షంలో గ్రహాలు పరివర్తనం చెందినప్పుడు 12 రాశులపై కూడా ఆ ప్రభావం కన్పిస్తుంటుంది. గ్రహాల స్థానచలనం కొన్ని రాశులపై శుభసూచకంగా ఉంటే..కొన్ని రాశులపై అశుభంగా ఉంటుంది. శుక్రగ్రహం రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉండనుందో పరిశీలిద్దాం..

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం శుక్రగ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. శుక్రగ్రహాన్ని సుఖ సంతోషాలు, సంపద, ధనం, ఐశ్వర్యాలకు ప్రతీకగా భావిస్తారు. ఫిబ్రవరి 15వ తేదీన శుక్రుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి పరివర్తనం కారణంగా మూడు రాశులపై అమితంగా డబ్బుల వర్షం కురవనుంది. సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. అంటే 25 రోజుల తరువాత ఈ మూడు రాశులపై రాజయోగం సంభవిస్తుంది. అమితంగా ధనవర్షం కలుగుతుంది. 

వృషభరాశి Taurs

వృషభరాశి వారికి మాలవ్య రాజయోగం సిద్ధిస్తుంది. ఫలితంగా ఊహించని లాభాలు కలుగుతాయి. కుండలిలో 11వ భావంలో మాలవ్య రాజయోగం ఉంటుంది. దాంతో కేవలం ఆదాయం పెరగడమే కాకుండా కెరీర్‌పరంగా విజయం లభిస్తుంది. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ చేస్తుంటే..అనుకూలమైన సమయం కావచ్చు.

కర్కాటక రాశి Scorpio

శుక్రగోచారం కారణంగా మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీంతో కర్కాటక రాశివారికి చాలా అనుకూలంగా ఉండనుంది. ఈ రాజయోగం కర్కాటకరాశి నవమ భాగంలో ఉంటుంది. నవమ భాగం విదేశాలకు, అదృష్టానికి ప్రతీకగా ఉంటుంది. ఈ గోచారం కారణంగా మీకు కెరీర్‌లో అభివృద్ధి లభిస్తుంది. విధి అనుకూలిస్తుంది. విద్యార్ధులకు ఈ సమయం చాలా బాగుంటుంది. 

మీనరాశి Pisces

మీనరాశి జాతకులకు మాలవ్య రాజయోగం అత్యంత శుభసూచకం కానుంది. ఈ గోచారం కుండలిలో లగ్నభావంలో ఉంటుంది. దీనివల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా సరైన అవగాహనతో పనిచేస్తే లాభాలుంటాయి. కెరీర్‌లో ఉన్నత స్థానం సాధించవచ్చు.

Also read: Jaya Ekadashi 2023: జయ ఏకాదశి ఎప్పుడు? దీని యెుక్క ప్రాముఖ్యత ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News