Venus Transit 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం రాశిని మార్చినప్పుడు అది నేరుగా అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. నవంబర్ 11వ తేదీ రాత్రి 08:08 గంటలకు శుక్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో శుక్రుడు దాదాపు 25 రోజుల పాటు ఉండి.. డిసెంబరు 5న ధనస్సురాశిలోకి ప్రవేశిస్తుంది. వృశ్చిక రాశిలో శుక్రుని సంచారం వల్ల ఏయే రాశుల మీద ప్రతికూల ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.
మిథునరాశి (Gemini): వృశ్చిక రాశిలో శుక్రుని సంచారం వల్ల మిథునరాశి వారి ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీరు ప్రయాణాలు చేస్తూ డబ్బును వృథాగా ఖర్చు పెడతారు. మతపరమైన మరియు సామాజిక పరమైన కార్యక్రామాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు రిస్క్ తీసుకోకుండా ఉండాలి.
కన్యారాశి (Virgo): కన్య రాశి వారికి శుక్రుని సంచారం వల్ల చాలా హాని జరుగుతుంది. పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ మెుండితనం, చేదు మాటలు కారణంగా వివాదాలను ఎదుర్కోంటారు. ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ కోరికలు తీర్చుకోవడానికి డబ్బును వృథా చేస్తారు.
ధనుస్సు రాశి (Sagittarius): శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారు భారీగా ఖర్చు పెడతారు. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈసమయంలో మీరు అప్పు తీసుకునే అవకాశం ఉంది. మనసులో తెలియన ఆందోళన ఉంటుంది. ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకండి, నష్టపోయే అవకాశం ఉంది.
మీన రాశి (Pisces): వృశ్చికరాశిలో శుక్రుని సంచారం మీనరాశివారి ప్రేమ జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వైవాహిక జీవితం బాగుండదు. ధనం దుబారా అవుతుంది. పిల్లల ఆరోగ్యం మరియు విద్య కోసం అధిక మెుత్తంలో ఖర్చు చేస్తారు. కుటుంబ విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అననుకూలంగా ఉంటుంది.
Also Read: Laxmi Narayan Yoga: లక్ష్మీ నారాయణ యోగం అంటే ఏమిటి? ఇది ఏ రాశుల వారికి ప్రత్యేకం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook