Shukra Gochar 2022: ఐశ్వర్యం, సంతోషం, వైభవం, విలాసాలనిచ్చే శుక్రగ్రహం అక్టోబర్ 18వ తేదీ రాత్రి 9.38 గంటలకు తన రాశిని మార్చి తులారాశిలోకి (Venus Transit in Libra 2022) ప్రవేశించింది. శుక్రుడు నవంబర్ 11, 2022 వరకు తులారాశిలో ఉండి.. ఆ తర్వాత వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎవరి జన్మరాశిలో శుక్రుడు కేంద్ర స్థానంలో సంచరిస్తున్నాడో వారందరికీ మాళవ్య యోగం ఏర్పడుతుంది. వీరికి శుభ ఫలితాలు లభిస్తాయి. అయితే శుక్రుడు ఉండటం వల్ల పూర్తి ప్రయోజనం లభించదు. ఏ రాశి వారికి శుక్ర సంచారం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి శుక్ర సంచారం శుభప్రదం
వృషభం (Taurus)- శుక్రుడు సంచారం వల్ల కోర్టు కేసుల్లో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేయాలనే కల నెరవేరుతుంది. గుండె లేదా ఉదర సంబంధిత వ్యాధులు ఉండవచ్చు.
కన్య (Virgo): శుక్రుని సంచారం మీకు ఆర్థిక బలాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తుల జీతం పెరగవచ్చు. వ్యాపారులు వ్యాపారంలో పెద్ద లాభాలను గడిస్తారు. మీరు ఇల్లు-కారు లేదా ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. యాత్రకు వెళ్లే అవకాశం ఉంది
తుల (Libra): ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తి అవుతాయి. కొత్త జాబ్ వస్తుంది. మీరు ప్రమోషన్, గౌరవం, డబ్బు పొందుతారు. వివాహం నిశ్చయమవుతుంది. మీరు కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకుండా ప్రయత్నించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
మకరం (Capricorn): శుక్రుడు రాశిలో మార్పు వల్ల మకర రాశి వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతికి బలమైన అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. ప్రమోషన్ పొందవచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. పెరిగిన ఆదాయం ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. వివాహం జరగవచ్చు. ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి త్వరగా పూర్తి చేస్తారు.
కుంభం (Aquarius): శుక్రుని సంచారం కుంభ రాశి వారికి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు టూర్ కు వెళతారు. తద్వారా శుభ ఫలితాలను పొందుతారు. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఊహించని ధనలాభాలు కలగవచ్చు. ఉద్యోగ-వ్యాపారాలలో కూడా లాభం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి.
Also Read: Dhanteras 2022: అదృష్టం వరించాలంటే..అక్టోబర్ 23 దంతేరస్ నాడు ఈ 5 వస్తువుల దానం తప్పనిసరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook