Venus Transit 2023: శుక్రుడి గోచారం ప్రభావం 3 రాశులకు నిండిపోనున్న ఖజానా

Venus Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్దేశిత రాశిలో నిర్ణీత సమయంలో ప్రవేశిస్తుంటుంది. దీనినే రాశి పరివర్తనం లేదా గ్రహ గోచారమంటారు. ఈ ప్రభావం వాస్తవానికి అన్ని రాశులపై పడుతుంటుంది. శుక్ర గ్రహం గోచారం గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 23, 2023, 07:32 AM IST
Venus Transit 2023: శుక్రుడి గోచారం ప్రభావం 3 రాశులకు నిండిపోనున్న ఖజానా

Venus Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. శుక్రుడు మే నెలల మిధున రాశిలో ప్రవేశించి నెలరోజులు అదే రాశిలో ఉంటాడు. ఫలితంగా మూడు రాశులప క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి. శుక్రుడి గోచారంతో మూడు రాశులవారి ఖజానా నిండిపోతోంది.

జీవితంలో సుఖ సంతోషాలు, లగ్జరీ, స్త్రీ సుఖం, సౌందర్యం, ఆకర్షణ అనేవి అందరికీ అవసరమే. జ్యోతిష్యం ప్రకారం ఇవన్నీ ఇచ్చేది శుక్రుడు. శుక్రుడు గోచారం చేసినప్పుడు  అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. శుక్రుడు మే నెలలోనే మిధున రాశిలో ప్రవేశించాడు. ఈ నెల అంటే మే నెలాఖరు వరకూ శుక్రుడు మిధునంలోనే ఉంటాడు. మే 30వ తేదీ రాత్రి 7 గంటల 51 నిమిషాలకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తుంది. ఫలితంగా 3 రాశులపై ప్రత్యేకంగా ఉండనుంది.

శుక్రుడి మిధున రాశి పరివర్తనం ప్రభావం కర్కాటక రాశి జాతకులపై స్పష్టంగా పడుతుంది. వ్యాపారులకు అద్భుతమైన లాభాలుంటాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆకశ్మిక ధనలాభముంటుంది. భారీగా డబ్బులు వచ్చి పడతాయి. పనిచేసే చోట గౌరవం లభిస్తుంది. పదోన్నతి, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. ఆరోగ్యపరంగా కాస్త అప్రమత్తత అవసరం.

కన్యా రాశి జాతకులకు శుక్రుడి గోచారం అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి జాతకుల అన్ని ఆర్ధిక సమస్యలు దూరమౌతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఫలితంగా ధన సంబంధిత సమస్యలు దూరమౌతాయి. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

మిధున రాశి జాతకులపై శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మిధున రాశికి అధిపతి బుధుడు. పూర్వీకుల సంపద కలిసి వస్తుంది. మీ తెలివి తేటలతో డబ్బులు సంపాదించగలరు. వ్యాపారులకు ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు రావచ్చు. కొత్త ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. ఆర్ధికంగా పరిస్థితి మెరుగుపడుతుంది.

Also read: Tuesday Remedies: శుక్లపక్షంలోని మొదటి మంగళవారం ఇలా వ్రతం చేస్తే, ధనవంతులవ్వడం కాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News