Venus Transit 2024: ఫిబ్రవరి 12 నుంచి ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్, ఊహించని డబ్బు

Venus Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడం వల్ల వివిధ రాశులకు సానుకూల లేదా ప్రతికూల ప్రభావం కలుగుతుంటుంది. ఫిబ్రవరిలో నెలలో కూడా కీలకమైన రాశి పరివర్తనం కారణంగా కొందరికి ఊహించని లాభాలు కలగనున్నాయి 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 12, 2024, 07:48 AM IST
Venus Transit 2024: ఫిబ్రవరి 12 నుంచి ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్, ఊహించని డబ్బు

Venus Transit 2024: ప్రతి గ్రహానికి ఓ విశిష్టత, మహత్యమున్నాయి. ప్రతి నెలా కొన్ని గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంటాయి. గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. వచ్చేనెల ఫిబ్రవరిలో శుక్రగ్రహం రాశి పరివర్తనం అత్యంత కీలకంగా మారనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిబ్రవరి నెలలో శుక్రుడు మకర రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా కొన్ని రాశులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. హిందూ జ్యోతిష్యం ప్రకారం శుక్రుడిని ధన సంపదలు, ఐశ్వర్యం, ప్రేమ, రొమాన్స్‌కు ప్రతీకగా భావిస్తారు. అలాంటి శుక్రుడు శని రాశి మకరంలో ప్రవేశించనున్నాడు. కుండలిలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఆ వ్యక్తి భౌతిక సుఖాలకు కొదవ ఉండదు. ప్రేమ జీవితం, పెళ్లి జీవితం రెండూ బాగుంటాయంటారు. ఫిబ్రవరి 12వ తేదీన మకర రాశిలో ప్రవేశించి మార్చ్ 6 వరకూ అదే రాశిలో కొనసాగనున్నాడు. ఫలితంగా మకర రాశి జాతకులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. 

శుక్రుడి కర్కాటక రాశి ప్రవేశం ప్రభావం కర్కాటక రాశి జాతకులపై ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు ఊహించని ప్రయోజనాలుంటాయి. పదోన్నతితో పాటు ఇంక్రిమెంట్లు ఉంటాయి. వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు కురిపిస్తాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్ ఈ రాశివారికి అనుకూలంగా ఉండవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పెళ్లికానివారికి పెళ్లి యోగం కలుగుతుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమౌతుంది. 

ఇక శుక్రుడు ప్రవేశిస్తున్న మకర రాశ జాతకులుకు ఊహించని లాభాలుంటాయి. జీవితంలో ఊహించని సంతోషాలు దక్కుతాయి. అపారమైన ధనలాభం ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. వ్యాపారులు కొత్త వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తత అవసరం. 

ఇక ఫిబ్రవరి 12వ తేదీ శుక్రుడి మకర రాశి ప్రవేశంతో మేష రాశి జాతకులపై అమితమైన ప్రభావం కన్పించనుంది. లక్ష్మీ దేవి కటాక్షం ఉండటం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో భారీ లాభాలుంటాయి. ఉద్యోగస్థులకు కూడా అనువైన సమయం. పనిచేసేచోట గుర్తింపుతో పాటు గౌరవం లభిస్తుంది. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. ఆర్దికంగా మంచి స్థితిలో ఉంటారు. 

Also read: Shani Gochar 2024: ఇవాళ శతభిషా నక్షత్రంలోకి శని గ్రహం.. ఈ 3 రాశులకు లాభదాయకం.

.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News