Venus Transit 2023: కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఏర్పడిన లక్ష్మీయోగం.. 4 రాశులకు మే 31 నుంచి మహర్దశే!

Venus Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఖగోళ శాస్త్రంలో గ్రహాల కదలిక ఓ సాధారణ ప్రక్రియ అయినా..జ్యోతిష్యం ప్రకారం విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2023, 10:10 AM IST
Venus Transit 2023: కర్కాటక రాశిలోకి శుక్రుడు..  ఏర్పడిన లక్ష్మీయోగం.. 4 రాశులకు మే 31 నుంచి మహర్దశే!

Venus Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ నిర్ణీత సమయంలో ఏదో ఒక రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఈ గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం మొత్తం 12 రాశుల జీవితాలపై ఉంటుంది. మే 30వ తేదీన శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 4 రాశులకు అంతా కనకవర్షమే..

గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం చూపించినట్టే శుక్రుడు మే 30వ తేదీన కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల అత్యంత శుభప్రదమైన లక్ష్మీ యోగం ఏర్పడనుంది. ఫలితంగా ఆ నాలుగు రాశులపై ఆకాశం నుంచి కనకవర్షం కురవనుంది. వద్దంటే డబ్బు వచ్చి పడుతుంది. మే 30వ తేదీ సాయంత్రం 7 గంటల 29 నిమిషాలకు శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా మకరరాశిలో లక్ష్మీయోగం ఏర్పడనుంది. హిందూ పంచాంగం ప్రకారం లక్ష్మీ యోగం కారణంగా మకర రాశి జాతకులకు విశేష లాభాలు కలగనున్నాయి. ఇతర రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

కర్కాటక రాశి జాతకులపై శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావంతో మే 30 నుంచి అంతా శుభప్రదం కానుంది. అందరూ మీ పట్ల ఆకర్షితులౌతారు. అపారమైన ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతో పాటు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి.

మకర రాశి జాతకులకు శుక్రుడి గోచారంతో లక్ష్మీయోగం ఏర్పడనుంది. ఈ లక్ష్మీయోగం ప్రభావంతో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఎక్కడికి వెళ్లినా మీ పనులు వెంటనే పూర్తవుతాయి. అంతులేని ధనలాభంతో పాటు పదోన్నతి కలుగుతుంది. ఆరోగ్యం కూడా అన్నివిధాలుగా బాగుంటుంది. ఆర్ధికంగా ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకావు. 

శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావంతో మేష రాశి జాతకులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులైతే పెద్ద పెద్ద డీల్స్ సాధించగలరు. జీవితంలో అన్నీ సంతోషాలు కన్పిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, జీతం పెంపు ఉంటుంది. ఆస్థి, భూమి, వాహనం వంటివి కొనుగోలు చేయగలరు. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త అవసరం. 

శుక్రుడి రాశి పరివర్తం ప్రభావంతో మిధున రాశి జాతకులకు ఊహించని రీతిలో ధనలాభం కలగనుంది. కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరి పెళ్లి కావచ్చు. ఆఖరికి ప్రేమ పెళ్లికి కూడా ఇంట్లో కుటుంబసభ్యులు ఆమోదం తెలుపుతారు. ఈ రాశివారి ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది.

Also read: Mercury Transit 2023: ఈ రెండు రాశులవారికి జూన్ 7 నుంచి తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News