Venus Reverse Movement: తిరోగమనంలోకి వెళ్లబోతున్న శుక్రుడు.. ఈ 4 రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం..

Shukra Vakri 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మరో నాలుగు రోజుల్లో రివర్స్ లో కదలనున్నాడు. శుక్రుడి యెుక్క ఈ వ్యతిరేక కదలిక నాలుగు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ ను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2023, 06:46 AM IST
Venus Reverse Movement: తిరోగమనంలోకి వెళ్లబోతున్న శుక్రుడు.. ఈ 4 రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం..

Vakri Shukra 2023 in Kark: లవ్, లగ్జరీ మరియు డబ్బు ఇచ్చే గ్రహం శుక్రుడు. శుక్రుడు తన రాశిచక్రాన్ని మార్చినప్పుడల్లా లేదా కదిలినప్పుడల్లా దాని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. ప్రస్తుతం శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు. జూలై 23న అతడు కర్కాటక రాశిలో తిరోగమనం చేస్తాడు. అదే స్థితిలో ఆగస్టు 07 వరకు ఉంటాడు. కర్కాటక రాశిలో శుక్రుడు రివర్స్ కదలిక ఏయే రాశులవారికి శుభఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. 

కన్య రాశి- శుక్రుని వ్యతిరేక కదలికకన్యా రాశి వారికి మేలు చేస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు కెరీర్ లో ఎదుగుతారు. విదేశాలకు వెళ్లాలనే వారి కల నెరవేరుతుంది. మీరు పదవి, డబ్బు, పలుకుబడి, ఆనందం అన్నీ పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉండబోతుంది. 
మకరం- శుక్రుడు రివర్స్ కదలిక మకరరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. మీరు మీ కెరీర్‌లో సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించగలరు. వైవాహిక జీవితం, ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. 
వృషభం - ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇతడి తిరోగమనం ఈ రాశివారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ మీకు వస్తుంది. మీ జీతం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ జీవితంలో సుఖాలు పెరుగుతాయి. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు.  
సింహ రాశి- తిరోగమన శుక్రుడు సింహ రాశి వారికి చాలా లాభాలను ఇస్తాడు. శుక్రుడి రివర్స్ కదలిక వల్ల వీరి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీకు సీనియర్ల సహకారం అందుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Pashvik Yog: చంద్రుడి రాశిలో ప్రమాదకరమైన యోగం.. ఈ 3 రాశుల జీవితం నాశనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News