Venus transit 2023: మిత్రుడి రాశిలో శుక్రుడి గోచారం.. ఈ రాశులకు కలిసి రానున్న కాలం..

Astrology: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు శనిదేవుడి రాశిలో సంచరిస్తున్నాడు. ఈ శుక్ర సంచారం కొన్ని రాశులకు అద్భుతంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2023, 01:45 PM IST
Venus transit 2023: మిత్రుడి రాశిలో శుక్రుడి గోచారం.. ఈ రాశులకు కలిసి రానున్న కాలం..

Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఒక వేళ మీ కుండలిలో శుక్రుడు అశుభ స్థానంలో ఉంటే మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. ప్రస్తుతం శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యెుక్క గోచారం వల్ల కొన్ని రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలయ్యాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మిథున రాశి
కుంభంలో శుక్రుడి సంచారం వల్ల మీ అదృష్టం మారిపోతుంది. అనారోగ్యం నుండి కోలుకుంటారు. వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇది భవిష్యత్తులో భారీగా లాభాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. 

వృశ్చిక రాశి
మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం  ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు భారీగా లాభపడతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. 

మేష రాశి
శుక్రుడి గోచారం వల్ల వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అధికారుల సపోర్టు లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. భూమి లేదా ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. 

మీన రాశి
ఈ రాశి వారి పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి. రుణ విముక్తి నుండి బయటపడతారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. 

Also Read: మరికొన్ని రోజుల్లో కుంభంలోకి సూర్యభగవానుడు... ఈ రాశులకు జాక్ పాట్ ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News