Venus Saturn Transit 2023: ప్రేమ, రొమాన్స్, సంపద, కీర్తి మరియు లగ్జరీ లైఫ్ కు శుక్రుడు కారకుడు. శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాతగా పిలుస్తారు. ఈ ఏడాది చివరలో శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే ఆ రాశిలో శనిదేవుడు ఉన్నాడు. మకరరాశిలో శుక్రుడు మరియు శనిదేవుడి కలయిక ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. శుక్ర మరియు శని గ్రహాల మధ్య స్నేహ భావం ఉంది. ఈ రెండు రాశుల సంయోగం నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries): శని రాశి అయిన మకరరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మేష రాశి వారికి చాలా లాభాలు చేకూరుతాయి. వీరు ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది.
కన్య (Virgo): కన్యారాశి వారికి శుక్ర, శని కలయిక అద్భుతంగా ఉంటుంది. ఒంటరి వ్యక్తులు భాగస్వామిని పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ సమయం బాగుంటుంది. వ్యాపారులు లాభపడతారు. దంపతులు సంతానం పొందే అవకాశం ఉంది.
మకరం (Capricorn): జనవరి 22, 2023 వరకు మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పనిలో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. వ్యాపారుల, ఉద్యోగులకు ఈ సమయం కలిసి వస్తుంది.
తుల (Libra): తులారాశి వారికి శని, శుక్రుల కలయిక వారి వృత్తిలో శుభ ఫలితాలను ఇస్తుంది. సీనియర్లతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీరు మీ కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పాత వివాదాలు పరిష్కరింపబడతాయి.
Also Read: Lohri 2023: లోహ్రీ పండుగ ఎప్పుడు? ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.