Shukra-Mangal Yuti: సింహరాశిలో రెండు పెద్ద గ్రహాల కలయిక.. ఈ 3 రాశులవారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..

Venus and Mars Conjunction 2023: జూలై నెలలో కొన్ని కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. కుజుడు, శుక్రుడు రాశులను మార్చనున్నారు. అంతేకాకుండా వీరిద్దరి కలయిక కూడా జరగబోతుంది. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2023, 09:22 AM IST
Shukra-Mangal Yuti: సింహరాశిలో రెండు పెద్ద గ్రహాల కలయిక.. ఈ 3 రాశులవారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..

Shukra-Mangal Gochar 2023: గ్రహాలు కాలనుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. సంపద, ఆనందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని, ధైర్యానికి కారకుడిగా అంగారకుడిని భావిస్తారు. జూలై నెల ప్రాంభంలో ఈ రెండు గ్రహాల కలయిక సింహరాశిలో జరగబోతుంది. ఇది అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

శుక్రుడు-కుజుడు సంయోగం ఈ రాశులకు వరం
సింహరాశి 
మీ లగ్న గృహంలో కుజుడు మరియు శుక్రుడు కలయిక జరగబోతోంది. మీకు మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీ వైవాహిక జీవితంలో తలెత్తిన విభేదాలు తొలగిపోతాయి. మీరు ఉన్నత స్థానాల్లో కూర్చున్న వ్యక్తులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు.
తులారాశి
శుక్ర, కుజుడు కలయిక వల్ల తులారాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాల కలయిక 11 వ ఇంట్లో ఏర్పడబోతోంది, దీని కారణంగా మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పాత పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. 

Also Read: Ketu transit 2023: ఈ రోజు చిత్రా నక్షత్రంలోకి కేతువు... ఈ 3 రాశులవారికి ఊహించని ధన నష్టం..!

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కూడా శుక్రుడు మరియు కుజుడు సంయోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సంచారం మీ జాతకంలోని 10వ ఇంట్లో జరగబోతోంది. దీంతో వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీరు కెరీర్ లో మంచి స్థాయికి వెళతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీకు కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 

Also Read: Rajyog 2023: బుధాదిత్య రాజయోగం ఈ 4 రాశులపై నోట్ల వర్షం.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News