Vasudev Dwadashi 2022: ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశినే వాసుదేవా ద్వాదశి లేదా వామన ద్వాదశి అంటారు. ఈ వాసుదేవా ఏకదశి రోజున శ్రీకృష్ణుడిని, తల్లి లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ సారి వాసుదేవా ద్వాదశి ఇవాళ అంటే జూలై 11, 2022 న జరుపుకుంటారు. విష్ణువు అవతారాల్లో ఒకటైన వామనుడిని ఈ రోజున (Vamana Dwadashi 2022) పూజిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణభగవానుడిని ఉపవాసం ఉండి భక్తితో పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే ద్వాదశాక్షర మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
ద్వాదశాక్షర మంత్రం ప్రయోజనాలు
>> వాసుదేవా ద్వాదశి రోజున ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించడం వల్ల మీ యెుక్క మానసిక మరియు శారీరక శక్తి పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉండి కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఈ మంత్రాన్ని కనీసం 101 సార్లు జపించాలి.
>> వాసుదేవా ద్వాదశి రోజున ఈ మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని రోజూ జపిస్తే..మీరు అనుకున్న పని పూర్తవుతుంది.
>> ఈ మంత్రం అన్ని గ్రహాల శాంతి కోసం తరుచూ ఉపయోగిస్తారు. నవగ్రహాల శాంతి కోసం ఈ రోజున ద్వాదశాక్షర మంత్రాన్ని 1008 సార్లు జపించడం శుభప్రదం.
Also Read; రేపు మకరరాశిలో శని తిరోగమనం.. ఈ 5 రాశులపై శని మహాదశ ప్రారంభం..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook