Vastu Tips for Tortoise: తాబేలు మీ ఇంట్లో ఉంటే.. ధనలక్ష్మీ మీ వెంటే..!

Vastu Tips for Tortoise: మీరు ఎంత కష్టపడినా చివరికి చేతిలో చిల్లి గవ్వ మిగలట్లేదా? అయితే ఈ చిన్న వస్తువును ఇంట్లో పెట్టుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 11:48 AM IST
  • ఇంట్లో డబ్బు నిలవటం లేదా
  • అయితే ఈ చిన్న వస్తువును ఇంట్లో పెట్టుకోండి
Vastu Tips for Tortoise: తాబేలు మీ ఇంట్లో ఉంటే.. ధనలక్ష్మీ మీ వెంటే..!

Vastu Tips for Tortoise:  డబ్బు కోసం కొంతమంది రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తారు. అయినా సరే వారి చేతిలో డబ్బు నిలవదు. మరికొంతమంది సులువుగా డబ్బు సంపాదిస్తారు. ఎందుకంటే వీరికి అదృష్టం కూడా తోడవుతుంది. కష్టపడి పనిచేసినా మీరు కోరుకున్న డబ్బును పొందలేకపోతే.. ఈ చిన్న వస్తువును ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ దశ మారుతుంది. అదే తాబేలు... వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్ ప్రకారం, తాబేలును అదృష్టంగా భావిస్తారు. ఇది ఉండటం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. 

** తాబేలును ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. వాస్తు మరియు ఫెంగ్ షుయ్‌లో తాబేలు పవిత్రమైనదిగా భావించడానికి కారణం ఇదే.  వాస్తు శాస్త్రం ప్రకారం, తాబేలు ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.  

** బతికి ఉన్న తాబేలు లేదా రాగి తాబేలు ఇంట్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా స్ఫటిక తాబేలును ఇంట్లో పెట్టుకుంటే.. మనిషి జాతకంలోని దుష్ట గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. వారి జీవితంలోని సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి. 

Also Read: Sun Transit Effect: ఈ నెలలో రాశిని మార్చబోతున్న సూర్యుడు.. 3 రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..! 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News