Varalakshmi Vratham 2022: వరలక్ష్మి వ్రతం పూజా సమయం, విధి విదానాలేంటి, ఉపవాస నియమాలు, పూజా సామగ్రిలో ఏముండాలి

Varalakshmi Vratham 2022: హిందూమత విశ్వాసాల ప్రకారం వరలక్ష్మీ వ్రతానికి అత్యంత ప్రాధాన్యత, మహత్యమున్నాయి. శ్రావణ మాసపు రెండవ శుక్రవారం నాడు ఆచరించే వరలక్ష్మీ వ్రతంలో..ఉపవాస నియమాలు, పూజా సామగ్రి, పూజా సమయం, వ్రత విధి వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 4, 2022, 10:46 PM IST
Varalakshmi Vratham 2022: వరలక్ష్మి వ్రతం పూజా సమయం, విధి విదానాలేంటి, ఉపవాస నియమాలు, పూజా సామగ్రిలో ఏముండాలి

Varalakshmi Vratham 2022: హిందూమత విశ్వాసాల ప్రకారం వరలక్ష్మీ వ్రతానికి అత్యంత ప్రాధాన్యత, మహత్యమున్నాయి. శ్రావణ మాసపు రెండవ శుక్రవారం నాడు ఆచరించే వరలక్ష్మీ వ్రతంలో..ఉపవాస నియమాలు, పూజా సామగ్రి, పూజా సమయం, వ్రత విధి వివరాలు తెలుసుకుందాం..

హిందూ మతంలో వరలక్ష్మీ వ్రతం చాలా ఘనంగా జరుపుకుంటారు.పెళ్లైన మహిళలైతే తప్పకుండా ఆచరిస్తారు. పిల్లలు, భర్త, కుటుంబం సంతోషం, ఆరోగ్యం కోసం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. లక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అష్టలక్ష్మికి పూజలు చేస్తారు. హిందూమతంలో ఇదొక ముఖ్యమైన పండుగ. ఈ ఏడాది ఆగస్టు 5 అంటే రేపు శుక్రవారం నాడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. 

వరలక్ష్మీ వ్రతం పూజా సమయం

లగ్నాన్ని బట్టి పూజా సమయం మారుతుంది. సింహలగ్నానికి ఉదయం 6.40 నిమిషాల్నించి 8.41 నిమిషాల వరకూ ఉంది. వృశ్చికలగ్నంవారికి మద్యాహ్నం 1.16 నిమిషాల్నించి 3.32 నిమిషాల వరకూ ఉంది. ఇక కుంభలగ్నంవారికి సాయంత్రం 7.24 నిమిషాల్నించి 8.57 నిమిషాల వరకూ ఉంది. వృషభరాశివారికి ఆగస్టు 6వ తేదీ తెల్లవారుజామున 12.08 నిమిషాల్నించి 2.06 నిమిషాల వరకూ ఉంది. 

వరలక్ష్మీ వ్రతం పూజా సామగ్రి

ఈ రోజున లక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. పూజా సామగ్రిలో కుంకుమ, సింధూరం, అక్షింతలు, హరిద్ర, చందనం, దొర గ్రంధి, వస్త్రం, కర్పూరం, యగ్నోపవీతం, అగరబత్తీలు, పిత్త, శ్రీ వరలక్ష్మి విగ్రహం, కలశం, దండలు, పంచపాత్ర, అర్ఘ్యపాత్ర, తాజా పండ్లు, పూలు, స్వీట్స్ ఉన్నాయి.

వరలక్ష్మీ వ్రతం పూజా విధానం

ముందుగా ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి, గంగాజలాన్ని ఇళ్లంతా చల్లాలి. వరలక్ష్మీ విగ్రహాన్ని నగలు, కొత్త వస్త్రాలు, కుంకుమ, పూలు ఇతర పూజా సామగ్రితో అలంకరించాలి. దీపాలతో విగ్రహానికి హారతి ఇవ్వాలి. అగరబత్తీలు, కర్పూరం వెలిగించాలి. రోజంతా ఉపవాస దీక్ష ఆచరించాలి. ఉపవాసదీక్ష ఆచరించేవాళ్లు..పూజ వరకూ ఏం తినకూడదు. పూజ తరువాత ప్రసాదం, పండ్లు తినవచ్చు. మరుసటి రోజు వరకూ ఏం తినకూడదు.

Also read: Varalakshmi Vratham 2022: వరలక్ష్మి వ్రతం ఆగస్టు 5న ఏ పొరపాట్లు అస్సలు చేయకూడదు, ఏం జరుగుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News