Shani Dhaiya 2022: ఈ 2 రాశులవారిపై శని మహాదశ తొలగిపోతుంది, జూలై నుంచి వీరు పట్టిందల్లా బంగారమే!

Shani Gochar July 2022: తిరోగమన శని తన రాశిని మార్చబోతున్నాడు. దీని సంచారం రెండు రాశుల వారికి అదృష్టాన్ని తెరుస్తుంది. ఎందుకంటే వీరిపై శని మహాదశ తొలగిపోతుంది  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 10:37 AM IST
  • జూలై 12న మకరరాశిలోకి శని తిరోగమనం
  • ఈ 2 రాశులవారికి అదృష్టం
Shani Dhaiya 2022: ఈ 2 రాశులవారిపై శని మహాదశ తొలగిపోతుంది, జూలై నుంచి వీరు పట్టిందల్లా బంగారమే!

Vakri Shani Gochar 2022, Shani Dhaiyaa July 2022: శని దైయాతో బాధపడుతున్న రెండు రాశులవారికి తిరోగమన శని సంచారం అదృష్టాన్ని తెరవబోతుంది. జూలై 12న శని మకరరాశిలోకి ప్రవేశించిన (Vakri Shani Transit in Capricorn 2022) వెంటనే ఈ రెండు రాశులవారు శని మహాదశ నుండి విముక్తి పొందుతారు. ఈ వ్యక్తుల  ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. పురోగతికి దారులు తెరుచుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. 

శని దేవుడు ఏప్రిల్ 29న తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. దీంతో కర్కాటకం, వృశ్చిక రాశులవారికి శనిమహాదశ మెుదలైంది. దీని తరువాత తిరోగమనం చెందిన శని...జూలై 12న మళ్లీ రాశిచక్రాన్ని మార్చబోతోంది. శని గ్రహం కుంభరాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశిస్తోంది. శని మకరరాశిలోకి ఎంటర్ అయిన వెంటనే కర్కాటక, వృశ్చిక రాశులకు శని ధైయా తొలగిపోతుంది. అయితే, ధైయా మరో 2 రాశిచక్ర గుర్తులపై ప్రారంభమవుతుంది. శని దోషం తొలగిన వెంటనే కర్కాటక, వృశ్చిక రాశి వారికి ప్రమోషన్-పెరుగుదల, వ్యాపారంలో విజయం, ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి.

ఈ రాశుల వారికి చెడ్డ రోజులు ఆరంభం
జూలై 12, 2022న శని మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే మిథున, తులారాశి వారిపై శని ధైయా మెుదలవుతుంది.  ఏప్రిల్ 29న కుంభరాశిలోకి శని ప్రవేశించడం వల్ల ఈ రెండు రాశులకూ సంకెళ్లు తొలగగా, ఇప్పుడు ఈ రెండు రాశుల వారు మరోసారి శని ఆగ్రహానికి గురవుతారు. 

శనికి ఈ పరిహారాలు చేయండి
శనిగ్రహ కోపం నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చర్యలు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో శని కూడా శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇందుకోసం శనివారం సాయంత్రం ఆవనూనె దీపం వెలిగించాలి. శని మంత్రాన్ని జపించండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. శనికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల కూడా గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి.

Also Read: Wednesday Astro Tips: బుధవారం నాడు ఈ రెండింటిని దానం చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News