Vaikunta Ekadasi 2023: జ్యోతిష్య శాస్త్రంలో తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి తిథుల్లోనే 11వ తిథిని ఏకాదశిగా పిలుస్తారు. జ్యోతిషం శాస్త్రం ప్రకారం ఏకాదశి పౌర్ణమి ముగిసిన తర్వాత 11 రోజుల తర్వాత వస్తుంది. అంతేకాకుండా అమావాస్య వచ్చేముందు 11వ రోజు ఈ ఏకాదశి తిథి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతినెల ఒక ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశిలన్నీ హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనవి. భారతదేశవ్యాప్తంగా చాలామంది తొలి ఏకాదశి..ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాడమాసం నుంచి పుష్య మాసం వరకు వచ్చే ఏకాదశి లకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ముఖ్యంగా చాలామంది తొలి ఏకాదశి రోజున ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల సంతాన సమస్యలు తీరిపోతాయి. ఇక పుష్య మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 23 శుక్రవారం రోజున వచ్చింది. ఈ సమయంలో శ్రీమహావిష్ణు ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని భక్తుల నమ్మకం అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు.
ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున చాలామంది భక్తులు ఉపవాసాలు, జాగరణలు పాటిస్తూ ఉంటారు. ఈరోజు చంద్ర, సూర్యుల నుంచి వచ్చే కిరణాలు నేరుగా జీర్ణక్రియ వైపు ప్రభావం చూపుతాయి దీనికి కారణంగా జీర్ణక్రియ సమస్యలు ఏవైనా సులభంగా దూరమవుతాయని శాస్త్రంలో పేర్కొన్నారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
సాధారణంగా మనం ప్రతిరోజు తీసుకునే కొన్ని ఆహారాలు జీర్ణం అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంతేకాకుండా కొన్ని ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం అవ్వకుండా ఉంటాయి. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్ధపదార్థాలన్నీ బయటకు తొలగిపోతాయి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసాలు పాటించే వారికి సూర్యుడు నుంచి వచ్చే కిరణాల ప్రభావం పడి అహ అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి