Trigrahi Yog: మకర రాశిలో అరుదైన యోగం... ఈ 3 రాశుల వారి లైఫ్ టర్న్ అవ్వడం ఖాయం..

Trigrahi Yog: పంచాంగం ప్రకారం, మకరరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కర్కాటకం, మేషం మరియు మిధున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2023, 11:04 AM IST
Trigrahi Yog: మకర రాశిలో అరుదైన యోగం... ఈ 3 రాశుల వారి లైఫ్ టర్న్ అవ్వడం ఖాయం..

Trigrahi Yog In Capricorn 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిచక్రాలను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తులు చేసుకుంటాయి. ఈ గ్రహాల సంయోగం కొందరికి శుభప్రదంగా, మరికొందరికి అశుభకరంగా ఉంటుంది. మకర రాశిలో శని, సూర్యభగవానుడు, శుక్ర గ్రహాల కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం (Trigrahi Yog) ఏర్పడుతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటక రాశిచక్రం(Cancer): త్రిగ్రాహి యోగం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. పార్టనర్ షిప్ చేసే వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు పడిన కష్టానికి ఫలితం ఉంటుంది. ఆఫీసులో మీ యెుక్క ప్రభావం పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 

మేష రాశిచక్రం (Aries): మేష రాశి వారికి త్రిగ్రాహి యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో పదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. వ్యాపారవేత్తలు గరిష్ట లాభాన్ని పొందుతారు. మీరు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగుల కల నెరవేరుతుంది. మీ పనికి ప్రశంసలు  దక్కుతాయి. 

మిథున రాశిచక్రం (Gemini): త్రిగ్రాహి యోగం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. మీరు పాత రోగాల నుండి విముక్తి పొందుతారు. పరిశోధన రంగంలో నిమగ్నమైన వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కెరీర్ లో మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 

Also Read: Saturn Transit 2023: త్వరలో శని నక్షత్రం మార్పు.. ఈ మూడు రాశులకు డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News