Horoscope January 15 2022: సంక్రాంతి పండుగ రోజు వారికి శుభదాయకం..

వృషభం రాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 08:52 AM IST
  • శనివారం.. మీ రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
  • ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం తప్పదు
Horoscope January 15 2022: సంక్రాంతి పండుగ రోజు వారికి శుభదాయకం..

Today's Horoscope January 15 2022:

మేషం: ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుంది. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.

వృషభం: స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

మిథునం: ప్రారంభించిన కార్యక్రమాలను దైవ బలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆంజనేయ ఆరాధన చేయాలి.

కర్కాటకం: పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. పిల్లల పట్ల జాగ్రత్తగా అవసరం. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.  ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.

సింహం: కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రారంభించిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. మనస్సు సౌఖ్యంగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

Also Read: Sarkaru vaari paata: సర్కారువారిపాట అప్‌డేట్ ఎప్పుడు, సినిమా మరోసారి వాయిదానా

కన్య: తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్త అవసరం. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. విందూవినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రవి ధ్యానం శుభప్రదం.

తుల: కృషితో ముందుకు సాగితే అన్ని విజయాలే. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. చెడును కోరేవారికి దూరంగా ఉండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు.

వృశ్చికం: కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. సొంత నిర్ణయాలు వద్దు. లింగాష్టకం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

ధనుస్సు: ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. విందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింత ఉండదు. ఇష్టదైవారాధన శుభప్రదం.

మకరం: ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. అధికారుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభప్రదం.

Also Read: ISRO new chief: సోమ​నాథ్​కు ఇస్రో పగ్గాలు.. ముగిసిన శివన్​ శకం

కుంభం: మిశ్రమ కాలం నడుస్తోంది. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగితే తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. అనవసరంగా డబ్బు ఖర్చు అగుటచే, ఆందోళన చెందుదురు. = ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. చంద్ర ధ్యానం శుభప్రదం.

మీనం: రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News