Daily horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశులవారు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది..

Today Horoscope: ఈరోజు కొన్ని రాశులకు మంచి కాలం నడుస్తుంటే... మరికొందరికి మిశ్రమంగా ఉండనుంది. ఇవాళ ఎవరి జాతకం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2022, 08:12 AM IST
Daily horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశులవారు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది..

Daily horoscope for November 12, 2022: మనం ఏ శుభకార్యం తలపెట్టినా, పని మెుదలుపెట్టినా, ఎక్కడికైనా వెళ్లినా ఆరోజు రాశిఫలాలను ఎలా ఉన్నాయని చూస్తాం. మరి ఈరోజు అంటే నవంబరు 12న దినఫలాలు (Horoscope on 12th November 2022)  ఎలా ఉన్నాయో చూద్దాం. 

మేషం (Aries): ఈరోజు మేషరాశి వారికి పెద్దగా కలసిరాదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అయితే ఈసమయంలో మీరు బంధు,మిత్రులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది. 
వృషభం (Taurus): మీరు ఏ పని మెుదలుపెట్టినా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఈసమయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. 
మిథునం (Gemini): ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు.  
కర్కాటకం (Cancer): వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అందరినీ కలుపుకొని పోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. 
సింహం (Leo): ఆర్థికంగా మీకు లాభిస్తుంది. పనుల్లో జాప్యం జరుగవచ్చు. కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు పొందుతారు. 
కన్య (Virgo): మీరు అనుకున్న సమయానికి పనులను పూర్తిచేస్తారు. అందరి ప్రశంసలను అందుకుంటారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
తుల (Libra): మీకు మిశ్రమకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీపై వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మెుదలుపెట్టిన పనుల్లో జాప్యం చేయకండి. వ్యాపారంలో నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
వృశ్చికం (Scorpio): మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. ఈసమయంలో అనవసరంగా ఆందోళన చెందకండి. ఖర్చులు నియంత్రించుకోవాలి.  బంధు, మిత్రులను కలుపుకోని పోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 
ధనస్సు (Sagittarius): మీ ఫ్యామిలీ సపోర్టుతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తార. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. 
మకరం (Capricorn): ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తీసుకోండి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. శత్రువులతో జాగ్రత్త వ్యవహారించండి. సమయాన్ని వృథా చేయకండి. 
కుంభం (Aquarius): కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. పనుల్లో ఆటంకం లేకుండా చూసుకోండి. అనవసర ధనవ్యయం మానుకోండి. 
మీనం (Pisces): మిశ్రమ కాలం నడుస్తోంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం  ఉంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహారించండి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. 

Also read: Mercury Transit 2022: మరో రెండు రోజుల్లో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News