Horoscope: 19/ఏప్రిల్/2022.. మంగళవారం.. 12 రాశులవారిలో ఆ రాశివారికి అద్భుతం జరగబోతుంది!

Todays Horoscope, April 19, 2022: మకరం, మీనం, వృశ్చిక రాశులవారికి ఇవాళ అత్యంత ప్రయోజనకరం. మకర రాశులవారికి ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో లాభముంటే..మీనరాశివారు ఆకర్షితులుగా మారుతారు. అటు వృశ్చికరాశివారికి వ్యవసాయరంగం కలిసొస్తుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 19, 2022, 11:34 AM IST
Horoscope: 19/ఏప్రిల్/2022.. మంగళవారం.. 12 రాశులవారిలో ఆ రాశివారికి అద్భుతం జరగబోతుంది!

Todays Horoscope, April 19, 2022: మకరం, మీనం, వృశ్చిక రాశులవారికి ఇవాళ అత్యంత ప్రయోజనకరం. మకర రాశులవారికి ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో లాభముంటే..మీనరాశివారు ఆకర్షితులుగా మారుతారు. అటు వృశ్చికరాశివారికి వ్యవసాయరంగం కలిసొస్తుంది.

చాలామందికి ఏరోజుకారోజు ఎలా ఉందో చూసుకునే అలవాటు, ఆసక్తి ఉంటాయి. రాశి ఫలాలు ఆ రోజు ఎలా ఉన్నాయో చూసుకోకపోతే ఏదో పోగొట్టుకున్న అనుభూతి కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఏ రాశివారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. 

మేషరాశివారికి ఇవాళ మంగళవారం నాడు మంగళమే. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఈ రాశివారికి పూర్తిగా విజయం ప్రాప్తిస్తుంది. చట్టపరమైన వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారరంగాల్లో ప్రగతి కన్పిస్తుంది. ఇక వృషభరాశివారికి ఇవాళ కాస్త ఇబ్బందికరమే. బంధుమిత్రుల్నించి ఇబ్బందులు, వివాదం తలెత్తుతుంది. మీ సహచరులు మీ బలహీనతల్ని ఎత్తి చూపిస్తారు. ఇక మిథున రాశివారికి ఇవాళ లాభదాయకమే. ప్రభుత్వం ద్వారా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానే ప్రయోజనాలు చేకూరుతాయి. మీ దైనందిక జీవితంలో లాభాలు ఆర్జిస్తారు. 

ఇక కర్కాటక రాశివారికి ఇవాళ పూర్తిగా సానుకూలమే. రాజకీయ వ్యవహారాల్లో తరచూ పాల్గొంటారు., మీ ఆత్మ విశ్వాసం రెట్టింపై మీకు బలాన్ని ఇస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభించడమే కాకుండా బాధ్యతలు కూడా లభిస్తాయి. కష్టమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇక సింహ రాశివారికి పూర్తిగా ప్రతికూల పరిస్థితి ఇవాళ. కుటుంబ సభ్యులతో వివాదం కారణంగా పూర్తిగా ప్రశాంతత కోల్పోతారు. ఇవాళ మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక కన్యారాశివారికి ఇవాళ అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఉద్యోగులకు మంచి రోజు. పదోన్నతులు లభిస్తాయి.. అదే సమయంలో బదిలీలు ఉంటాయి. 

ఇక తులా రాశివారికి  ఇవాళ మిశ్రమ ఫలితాలు ఎదురౌతాయి. అనవసరమైన విషయాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దని జ్యోతిషులు సూచిస్తున్నారు. తీసుకునే నిర్ణయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఇక వృశ్చిక రాశివారుకి ఇవాళ పూర్తిగా మంచి ఫలితాలుంటాయి. వీఐపీలతో పరిచయాలు ప్రయోజనంగా మారతాయి. వ్యాపారాల్లో కొత్త భాగస్వామ్యాలు లాభాలనిస్తాయి. ఇక మీ ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. ధనస్సు రాశివారికి కూడా ఇవాళ ప్రయోజనకరం. ఆరోగ్యపరంగా, ఆర్ధిక పరంగా బాగుంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. అందరితో మంచి సంబంధాలుంటాయి.

మకర రాశివారికి ఇవాళ సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్థులైతే పెట్టుబడులు పెట్టేందుకు లేదా కొత్త వ్యాపారం ప్రారంబించేందుకు ఇవాళ పూర్తిగా మంచిది. చేపట్టాల్సిన పనులు అనుకూలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అదృష్టం కలిసొస్తుంది. ఇక కుంభ రాశివారికి ఇవాళ పెద్దగా బాగుండదనే చెప్పాలి. మీ జీవిత భాగస్వామితో ఇబ్బందులు లేదా అభిప్రాయబేధాల కారణంగా ఇబ్బందులు ఎదురౌతాయి. ఏ విషయంలోనూ ప్రశాంతత ఉండదు. ఇక మీనరాశివారికి ఇవాళ పూర్తిగా మంచిది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అత్యంత అనువైంది. వీఐపీలతో సంబంధాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

Also read: Sankashti Chaturthi 2022: రేపు సంకష్ట చతుర్థి... ఆ రోజున ఈ పనులు చేయకండి! శుభ ముహూర్తం వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News