Arunachalam Temple Giri Pradakshina: నవంబర్ లేదా డిసెంబర్ నెలలో చాలా మంది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలైనా తొలగిపోవడమే కాకుండా ఆ ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మకం. గతంలో అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువే అయినప్పటికీ.. రాను రాను ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్కడ ఉన్న మహాశివుడు చాలా పవర్‌ఫుల్‌గా భావిస్తారు. అంతేకాకుండా గిరి ప్రదక్షిణ చేసి కోరుకలు కోరుకోవడం వల్ల సులభంగా నెరవేరుతుందని నమ్మతారు. అయితే చాలా మంది ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో కొన్ని చేయకూడని పనులు చేస్తున్నారు. అయితే గిరి ప్రదక్షిణ సమయంలో ఎలా ఉండాలో.. ఎలా చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చేయకూడని పనులు:
ప్రస్తుతం చాలా మంది కొత్త వివాహమైన జంటలు అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్తున్నారు.. గిరిప్రదక్షిణం చేసేటప్పుడు అక్కడ శృంగారం చేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం మంచిదికాదని పండితులు చెబుతున్నారు. కొత్తగా పెళ్లైన వాళ్ళని లేకపోతే వెర్రి ఉన్న వాళ్ళు ఉంటారు. పెళ్లయి ఎంతకాలమైనా వాళ్ళు అక్కడికి రావడం ఆ రోడ్లమీద సెల్ఫీలు తీసుకుంటూ..ముద్దులు పెట్టుకోవడం చేస్తున్నారు. నిజానికి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఇలాంటి పనులు చేయడం మానుకోవాల్సి ఉంటుంది.
అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా మంది పిచ్చి పిచ్చి మాటలు అన్ని మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం కూడా చాలా పెద్ద తప్పుగా పండితులు భావిస్తున్నారు. అక్కడ లేని మూడో వ్యక్తి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఎప్పుడూ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం మంచిది. ఈ సమయంలో మౌనంగా లేదా జపం చేస్తూ హాయిగా శివ నామం పలుకుతూ ప్రదక్షిణ పూర్తి చేస్తుంటే శివుడి అనుగ్రహం లభిస్తుంది.
ప్రస్తుతం చాలా మంది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చెప్పులు ధరిస్తున్నారు. నిజానికి నడిచే సమయంలో రోడ్డుపై రాళ్లు ఇబ్బంది కలిగిస్తున్నాయని ఇలా చెప్పులు వేసుకుంటున్నారు. ఇలా చేయడం అస్సలు మంచిదికాదు. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు మాత్రం వారి కాళ్లకు ఏమి తగలకుండా సాక్సులు ధరించడం మంచిది. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో దృష్టి మొత్తం ఈశ్వరుడు మీద ఉండేలా చూసుకోండి.
కొంత మంది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఇబ్బందికర దుస్తువులు వేసుకుని వెళ్తున్నారు. ప్రదక్షణ చేసే ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తువులను ధరించడం చాలా మంచిది. అలాగే ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఎప్పుడు గిరికి ఆంటీ క్లాక్ వైస్‌లో తిరగడం మంచిదికాదని నిపుణులు తెలుపుతున్నారు. క్లాక్ వైజ్‌లో మాత్రమే తిరిగితే శివుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రదక్షణ ఆరంభించిన తర్వాత ఎలాంటి కోరిక కోరుకోకూడదని ఒక నియమం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.