Mars Tarnsit 2023: జనవరి 13న కుజ ప్రత్యక్ష సంచారం.. ఈ 5 రాశుల వారికి అఖండ ఐశ్వర్యం!

These 5 zodiac signs will get Great Wealth due to Mangal Gochar 2023. 2023 జనవరి 13న వృషభ రాశిలోకి కుజుడు సంచరిస్తాడు. ఈ కుజ ప్రత్యక్ష సంచారం ఈ ఐదు రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 26, 2022, 01:18 PM IST
  • జనవరి 13న కుజ సంచారం
  • ఈ 5 రాశుల వారికి అఖండ ఐశ్వర్యం
  • ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి
Mars Tarnsit 2023: జనవరి 13న కుజ ప్రత్యక్ష సంచారం.. ఈ 5 రాశుల వారికి అఖండ ఐశ్వర్యం!

These 5 zodiac signs will get Great Wealth due to Mars Tarnsit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఓ నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మారుస్తుంటుంది. ఈ క్రమంలోనే అంగారకుడు (కుజుడు) త్వరలోనే తన రాశి చక్రాన్ని మార్చబోతున్నాడు. 2023 జనవరి 13న వృషభ రాశిలోకి కుజుడు సంచరిస్తాడు. ధైర్యం, పరాక్రమంకు కారకుడైన కుజుడు ప్రత్యక్షంగా సంచరించడం వల్ల మొత్తం 12 రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ కుజ ప్రత్యక్ష సంచారం ఈ ఐదు రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. ఆ రాశులు ఏవో ఓసారి చూద్దాం. 

వృషభం: 
వృషభ రాశిలో కుజుడు ప్రత్యక్ష సంచరించడం కారణంగా ఈ రాశి వారికి మంచి ప్రయోజనం లభిస్తుంది. కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. మీ కోరిక నెరవేరుతుంది. దూర ప్రయాణం చేయవచ్చు. వ్యాపారంలో ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

సింహం: 
సింహ రాశి వారికి కుజ ప్రత్యక్ష సంచారం గొప్ప ప్రయోజనాలను ఇవ్వనుంది. కార్యాలయంలో వాతావరణం మెరుగ్గా ఉంటుంది. కొత్త టెండర్ కోసం దరఖాస్తు చేస్తే విజయం సాధిస్తారు. మీ కృషి మరియు నిజాయితీతో లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు. అన్ని పనుల్లో  పురోగతి ఉంటుంది.

వృశ్చికం: 
కుజుడు ప్రత్యక్ష సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు రావాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉంటాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది.

ధనుస్సు: 
కుజ ప్రత్యక్ష సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి పెట్టుబడులలో లాభాలు చేకూరుతాయి. మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ అన్వేషణ ముగుస్తుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామికి సమయం ఇస్తారు.

మీనం: 
అంగారకుడి గమనంలో మార్పు మీన రాశుల వారి వ్యక్తిత్వంలో మార్పులను తెస్తుంది. ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.  మీన రాశుల వారు కెరీర్‌లో గొప్ప విజయాన్ని పొందవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అన్ని పనులలో మంచి ఫలితాలు పొందుతారు.

Also Read: Team India: కొత్త ఏడాదిలో టీమిండియా ముందు ఈ 3 సవాళ్లు.. రోహిత్ సేన అధికమిస్తుందా..?  

Also Read: Trisha Krishnan: కాంగ్రెస్ లోకి త్రిష అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేసిన త్రిష!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News