Mars Retrograde 2023: తిరోగమనంలో కుజుడు.. ఈ 4 రాశుల వారిని వరించనున్న అదృష్టం! రెండు చేతులతో డబ్బు సంపాదిస్తారు

These 4 Zodiac Sign peoples will become rich due to Mars Retrograde 2023. 4 రాశుల వారు అంగారకుడి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు. లక్ష్మిదేవి ఈ వ్యక్తుల పట్ల దయ చూపుతుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 16, 2023, 08:26 AM IST
  • తిరోగమనంలో కుజుడు
  • ఈ 4 రాశుల వారిని వరించనున్న అదృష్టం
  • రెండు చేతులతో డబ్బు సంపాదిస్తారు
Mars Retrograde 2023: తిరోగమనంలో కుజుడు.. ఈ 4 రాశుల వారిని వరించనున్న అదృష్టం! రెండు చేతులతో డబ్బు సంపాదిస్తారు

These 4 Zodiac Signs will become rich due to Mars Retrograde 2023: జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని అన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. జాతకంలో శుభ స్థానంలో ఉన్న వ్యక్తులకు ప్రతి పనిలో కుజుడు విజయాన్ని ఇస్తాడు. కుజుడు తన రాశిని మార్చుకున్నప్పుడల్లా మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతుంది. 2023 జనవరి 13న ఉదయం 4:25 నుంచి మార్గి కదలికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు కుజుడు తిరోగమనంలో నడిచాడు. అక్టోబర్ 30 వరకు నేరుగా వృషభ రాశిలో సంచరిస్తాడు. దాంతో అన్ని రాశిచక్ర గుర్తులు ప్రభావితం కానున్నాయి. అయితే 4 రాశుల వారు అంగారకుడి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు. లక్ష్మిదేవి ఈ వ్యక్తుల పట్ల దయ చూపుతుంది.

మేష రాశి:
కుజుడు ధైర్యానికి కారకుడు కాబట్టి మేష రాశి వారు తమ పని పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ధనలాభం వల్ల ఆర్థిక రంగం బలపడుతుంది. ఇంటికి అతిథి రాక వల్ల సంతోషం ఉంటుంది. మతపరమైన ప్రయాణం చేయవచ్చు.

మిధున రాశి:
కుజుడు ప్రత్యక్ష సంచారం వల్ల మిథున రాశి వారికి అధిక లాభం చేకూరుతుంది. ఉద్యోగంలో కోరుకున్న ప్రదేశానికి బదిలీ కావచ్చు. అదే సమయంలో కొత్త బాధ్యతలు రావడంతో మనసుకు ఆనందం కలుగుతుంది. ఈ బాధ్యత మీకు ఎంతో మేలు చేస్తుంది. 

తులా రాశి: 
తులా రాశి వారికి కుజుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ సమయంలో ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఆర్థిక స్థితిని బలోపేతం అవుతుంది. ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇది రాబోయే కాలంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు కుజుడు కుడి వైపున ఉండటం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగం లేదా కార్యాలయంలో అధికారుల సహకారం ఉంటుంది. ఇంట్లో సంతోష సాధనాలు పెరుగుతాయి. శ్రమకు తగిన పూర్తి ఫలితాలు పొందుతారు.

Also Read: Delhi Cold Weather: పడిపోతున్న ఢిల్లీ ఉష్ణోగ్రతలు.. నేటి నుంచి మరో 'కోల్డ్‌ స్పెల్‌

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్వల్పంగా పెరిగిన గోల్డ్ ధర! స్థిరంగా వెండి ధర  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

 

Trending News