Surya Mahadasha: సూర్యుడి మహాదశ ఎఫెక్ట్... మీపై ఆరు సంవత్సరాలు డబ్బు వర్షం..

Surya Dev: గ్రహాల రాజు సూర్యభగవానుడు మహాదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది. మీ జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. సూర్యుడి అశుభ ప్రభావాలను నివారించడానికి కొన్ని పరిహారాలు చేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 16, 2023, 04:55 PM IST
Surya Mahadasha: సూర్యుడి మహాదశ ఎఫెక్ట్... మీపై ఆరు సంవత్సరాలు డబ్బు వర్షం..

Surya Mahadasha Effects:  ప్రతి గ్రహానికి మహాదశ మరియు అంతర్దశ ఉంటాయి. ఎవరి జాతకంలో మహాదశ శుభప్రదంగా ఉంటుందో వారు కింగ్ లాంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఆస్ట్రాలజీలో సూర్యదేవుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. సాధారణంగా సూర్యుడి మహాదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది. ఈ మహాదశ ఎవరికి శుభఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. 

శుభ ప్రభావం
జాతకంలో సూర్యుడు శుభ స్థానంలో ఉన్న వ్యక్తులు మహాదశలో శుభ ఫలితాలను పొందుతారు. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. 
అశుభ ప్రభావం
కుండలిలో సూర్యుడు బలహీనమైన, నీచమైన లేదా అశుభ స్థానంలో ఉన్న వ్యక్తులు మహాదశ కాలంలో చాలా కష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీ కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. మీ కెరీర్ అనుకున్న విధంగా ఉండదు. సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. 

Also Read: Shani Jayanti 2023: శని జయంతి నాడు 3 రాజయోగాల కలయిక...ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..

పరిహారం
మీరు సూర్యుని మహాదశలో అశుభ ఫలితాలు పొందుతున్నట్లయితే... మీరు ప్రతి ఆదివారం రాగి మరియు గోధుమలను దానం చేయండి. అంతేకాకుండా రాగిపాత్రలో నీటిని తీసుకుని అందులో అక్షతలు, రోలీ వేసి అర్ఘ్యం సమర్పించండి. రోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీనితో పాటు ఓం హ్రాం హ్రీం హ్రాం స: సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఆదివారం సాయంత్రం పీపుల్ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి.

Also Read: Sun transit 2023: సూర్య సంచారంతో ఈ రాశులను వరించనున్న అదృష్టం.. మీ రాశి ఉందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News