Surya Gochar 2023: ఆస్ట్రాలజీలో ధైర్యం, ఉత్సాహం మరియు ఆరోగ్యానికి సూర్యదేవుడు కారకుడు. సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లడాన్ని సంక్రాంతి అంటారు. జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే మకరంలో శనిదేవుడు ఉన్నాడు. ఒకేరాశిలో తండ్రీకొడుకులు కలయిక మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. సూర్యుడు, శని ఇద్దరికీ అస్సలు పడదు. అలాంటి శని రాశిలో సూర్య సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం (Taurus): సూర్యుడు మకరరాశిలోకి వెళ్లడం వల్ల వృషభ రాశి వారికి మేలు జరుగుతుంది. వృషభ రాశి వారు ఈ కాలంలో వృత్తి మరియు వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. మీకు అదృష్టం కలిసి రావడంతో మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి.
మిధున రాశి (Gemini): మిథున రాశి వారికి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వీరు కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. వ్యాపారం విస్తరిస్తుంది. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆర్థికంగా పురోగమిస్తారు. మానసిక ఒత్తిడి దూరమవుతుంది.
కర్కాటక రాశి (Cancer): మకరరాశిలో సూర్యుని సంచారం కర్కాటకరాశి వారికి మేలు చేస్తుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
మకరం (Capricorn): సూర్యుడు మకరరాశిలో సంచరించడం వల్ల మీరు భారీగా లాభాలను పొందుతారు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. పాత రోగాల నుండి విముక్తి పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో పురోగతికి మార్గం తెరుచుకుంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
Also Read: Shukra Gochar 2023: ఆరుదైన యోగం చేస్తున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు ఏడాది మెుత్తం డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Surya Gochar 2023: సూర్యభగవానుడు సంక్రాంతికి ఈ రాశులకు భారీ మెుత్తంలో డబ్బును ఇవ్వనున్నాడు.. ఇందులో మీరున్నారా?