Chaturgrahi yog: మీన రాశిలో 'చతుర్గ్రాహి యోగం'.. ఉగాది నుండి ఈ రాశులకు కావాల్సినంత ధనం..

Chaturgrahi yog: ఇవాళ మీనరాశిలో నాలుగు గ్రహాలు కలయిక జరిగింది. దీంతో మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 03:54 PM IST
Chaturgrahi yog: మీన రాశిలో 'చతుర్గ్రాహి యోగం'.. ఉగాది నుండి ఈ రాశులకు కావాల్సినంత ధనం..

Chaturgrahi yog benefits: తెలుగువారి సంవత్సరాది అయిన ఉగాది పండుగను ఇవాళ అంటే మార్చి 22న జరుపుకుంటున్నారు. ఈరోజు గ్రహాల స్థితి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ ఉగాది పర్వదినాన నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. మీనరాశిలో ఈరోజు సూర్య, బుధ, గురు మరియు చంద్ర గ్రహాల సంయోగం ఏర్పడబోతుంది. దీని కారణంగా చతుర్గ్రాహి యోగం రూపొందుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో  తెలుసుకుందాం. 

కుంభం
చతుర్గ్రాహి యోగం కుంభరాశివారికి మేలు చేస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగస్తులు పదోన్నతి లభిస్తుంది. జాబ్  కోసం  ట్రై చేసేవారికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. 
మిథునం
ఈ రాశివారికి చతుర్గ్రాహి యోగం ప్రయోజనకరంగా ఉండబోతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. 
వృషభం
మీనంలో నాలుగు గ్రహాల కలయిక వృషభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృషభరాశి వారు లాభపడతారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ధన లాభం  ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జాబ్ చేసేవారు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే  అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. 

Also read: Mercury transit 2023: అరుదైన యోగం చేస్తున్న బుధుడు.. ఉగాది నుంచి ఈ 3 రాశులకు అన్నీ శుభాలే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News