Grah Gochar 2022: గ్రహాల సంచారానికి డిసెంబరు నెల చాలా ముఖ్యమైనది. ఆస్ట్రాలజీ ప్రకారం, డిసెంబరు 16న సూర్యభగవానుడు, డిసెంబరు 31న తిరోగమన బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నారు. ధనస్సు రాశిలో సూర్యభగవానుడి సంచారాన్ని ధను సంక్రాంతి అంటారు. జెమినిలో తిరోగమన బుధుడు మరియు సూర్యుని సంచారం వల్ల కొన్ని రాశులవారు అనుకూల మరియు ప్రతికూల ప్రయోజనాలను పొందనున్నారు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల ఏరాశివారు లాభపడనున్నారు, ఏరాశివారు నష్టపోనున్నారో తెలుసుకుందాం.
మేషరాశి (Aries); సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారికి మంచి ఫలితాలను పొందుతారు. వీరికి వివాహం జరిగే అవకాశం కూడా ఉంది. అయితే తిరోగమన బుధుడు ఈరాశి వారికి కొన్ని సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. వ్యాపారంలో అడ్డంకులు ఎదుర్కోంటారు. సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.
వృషభం (Taurus): సూర్యుడు మరియు తిరోగమన బుధుడు ధనుస్సులో కలవడం వల్ల మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ సమయం మీకు అంతగా కలిసిరాకపోవచ్చు. అయితే సూర్యదేవుడు ఈరాశివారికి అపారమైన సంపదను ఇస్తాడు.
కర్కాటకం (Cancer): ధనుస్సు రాశిలో సూర్యుని సంచారంఈ రాశివారికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటాయి. అయితే తిరోగమన బుధుడు కారణంగా మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశిలో సూర్య భగవానుడి సంచారం జరుగుతుంది, కాబట్టి ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. అధికారుల సపోర్టు మీకు లభిస్తుంది. వ్యాపారంలో విజయం ఉంటుంది. మరోవైపు ధనుస్సులో తిరోగమన బుధుడు కారణంగా ఈరాశివారు వృత్తిలో పురోగతి సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు.
Also Read: Lucky Zodiacs: ఈ 5 రాశుల వారు తక్కువ టైం లోనే ధనవంతులు అవుతారు.. ఇందులో మీరున్నారా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook