Sun Transit in Sagittarius : ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఆ నాలుగు రాశులకు చాలా ప్రమాదం

Effects of Sun Transit in Sagittarius : ప్రసుతం సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి రావడంతో పలు రాశులపై పలు ప్రభావాలు పడతాయి. ఒక నెల పాటు ఆ రాశుల వారు అప్రమత్తతంగా ఉండాలి. మరి ఆ రాశులు ఏమిటో ఒకసారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 12:50 PM IST
  • ధనుస్సురాశిలోకి సూర్యుడు
  • కొన్ని రాశుల వారికి శుభం.. మరికొన్ని రాశుల వారికి అశుభం
  • జనవరి 14, 2022న మకరరాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడు
  • ఆ నాలుగు రాశుల వారికి చాలా ప్రమాదం
Sun Transit in Sagittarius : ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఆ నాలుగు రాశులకు చాలా ప్రమాదం

Sun Transit in Sagittarius will be bad for 4 zodiac natives till next one month : సూర్యుడు ధనుస్సురాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడిని నవగ్రహాల రాజుగా పేర్కొంటారు. సూర్యభగవానుడు (Surya Bhagavanudu) ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. ఇలా సూర్యుడు రాశి పరివర్తనం చెందడంతో కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది.. కొన్ని రాశుల వారికి అశుభం చేకూరే అవకాశం ఉంటుంది. 

ప్రసుతం సూర్యుడు ధనుస్సు రాశిలోకి (Sagittarius) ప్రవేశించాడు. ఈ రాశిలోనే ఒక నెల పాటు ఉండి, జనవరి 14, 2022న మకరరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్య భగవానుడు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి రావడంతో పలు రాశులపై పలు ప్రభావాలు పడతాయి. కొన్ని రాశుల వారు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆ రాశులపై ప్రస్తుతం సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక నెల పాటు ఆ రాశుల వారు అప్రమత్తతంగా ఉండాలి. మరి ఆ రాశులు ఏమిటో ఒకసారి చూద్దాం.

మిథునరాశి: 
మిథున రాశి (Gemini) వారు ప్రస్తుతం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి మితిమీరిన కోపం వల్ల తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరితోనూ వాదనలకు దిగకండి.

కన్య: 
కన్యా రాశి (Virgo) వారు కూడా కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీరి మనస్సు కూడా స్థిరంగా ఉండదు. మీరు ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం చేయడం మంచిది. వాదనలకు దూరంగా ఉండండి.

Also Read : Minimum Age For Marriage: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21కి పెంపు..!
వృశ్చికం: 
వృశ్చిక రాశి (Scorpio) వారు ప్రస్తుతం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా డబ్బు సంపాదించే క్రమంలో ఎలాంటి తప్పుడు మార్గాలను ఎంచుకోకండి. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బందుల్లోపడతారు. ఉన్నదానితో సంతృప్తి చెందడానికి ప్రయత్నించండి.

మకరం: 
మకర రాశి (Capricorn) వారు ఆర్థికంగా కాస్త ఇబ్బందులుపడాల్సి వస్తుంది. రాబోయే ముప్పై రోజుల పాటు మీకు కొన్ని పెద్దపెద్ద ఖర్చులే వస్తాయి. ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంటుంది. సరైన ప్రణాళికతో ఒక బడ్జెట్ ప్రకారం ముందుకు వెళ్లడం మంచిది.

ఇక ధనుస్సు రాశిలోని సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశులకు వారికి శుభం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తులారాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశుల వారంతా (Rasi) వారి వృత్తుల్లో పురోగతి సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. అలాగే కుంభం, మీన రాశి వారికి కూడా రాబోయే 30 రోజులు ఎంతో మంచివి.

Also Read : Egg Yolk Protein: మీరు తినే కోడిగుడ్డు ఆరోగ్యకరమైనదేనా?- అందులో అధిక ప్రొటీన్లు ఉన్నాయా తెలుసుకోండిలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News